Shivani Nagaram | అలా చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించవన్నారు – శివానీ నగరం కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు పెరిగాయని హీరోయిన్ శివానీ నగరం అన్నది. హీరోయిన్‌గా వంద సినిమాలు చేయాలనే కోరిక తనకు లేదని తెలిపింది. ఐదారు సినిమాలు అయినా మంచి క్యారెక్టర్లు చేశాననే సంతృప్తి దక్కితే చాలని చెప్పింది.
Entertainment | Published On Feb 16, 2026, 7.46 pm IST
Shivani Nagaram | అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు, లిటిల్ హార్ట్స్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది అచ్చ తెలుగు బ్యూటీ శివానీ నగరం. ఈ రెండు సక్సెస్‌ల తర్వాత శిశివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోన్న హే బల్‌వంత్ ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రాబోతుంది. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీలో సీనియర్ నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వం వహించాడు. హే బలవంత్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాతో పాటు తన కెరీర్ గురించి శివానీ నగరం చెప్పిన ముచ్చట్లివే...
సుహాస్‌తో రెండో సినిమా...
తర్వాత సుహాస్‌తో నేను చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఓవరాల్‌గా నా కెరీర్‌లో మూడోసినిమా..అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు లో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. ఇందులో మాత్రం నా పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. చివరలో వచ్చే ఫాదర్ ఎమోషన్ కదిలిస్తుంది. నాతో సహా సుహాస్, నరేష్, వెన్నెలకిషోర్ ప్రతి పాత్ర నవ్విస్తుంది. లిటిల్ హార్ట్స్ హిట్ తర్వాత చాలానే సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. నా దగ్గరకు వచ్చిన వాటిలో నుంచి మంచి కథలను ఎంచుకుంటున్నారు. కథ పాత్రల పరంగా వైవిధ్యత ఉండేలా చూసుకుంటున్నా.
లిటిల్ హార్ట్స్‌లో ఓ పాట పాడా...
సినిమాల్లోకి రాకముందు కూచిపూడి డ్యాన్స్‌తో పాటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాఉ. సింగర్ టర్నింగ్ యాక్టర్‌ని. లిటిల్ హార్డ్స్‌లో ఓ పాట పాడాను. సింగర్‌గా అఅవకాశాలు వస్తే సినిమాల్లో పాటలు పాడుతాను. సినిమాల్లోకి వెళతానంటే మా ఇంట్లో వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చాలా సపోర్ట్ చేశారు. వారి నమ్మకాన్ని మంచి సినిమాలు చేసి నిలబెట్టాను. నా కెరీర్, సినిమాల ఎంపిక విషయంలో మా కుటుంబసభ్యులు హ్యాపీగా ఉన్నారు.
కాంబినేషన్‌తో సంబంధం లేకుండా...
కథ నచ్చితేకాంబినేషన్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాను. కథ వింటున్నప్పుడు నేను ఆ కథతో కనెక్ట్ అవుతున్నానా? నా పాత్రకు ఎంత వరకు ప్రాధాన్యం ఉంటుందన్నదే చూసుకుంటాడు. అంతకుమించి లెక్కలేవీ వేసుకోను. హీరోయిన్‌గా నాకు 100 సినిమాలు చేయాలనే కోరికలు లేవు. చేసినవి ఐదారు అయినా మంచి సినిమాలు చేశాననే సంతృప్తి దక్కితే చాలు. ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. హీరోయిన్‌గా నాకంటూ ఆడియన్స్ ఇచ్చిన గుర్తింపును నిలుపుకోవటమే ముఖ్యంమని అనుకుంటున్నా.
సెలెక్టివ్‌గా...
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగు యాక్టర్లతో పాటు రైటర్స్, దర్శకులు ఎక్కువయ్యారు. తెలుగు అమ్మాయిలకు ఛాన్స్‌లు పెరిగాయి. చాలా మంది వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావని అన్నారు. కానీ అలాంటి మాటల్ని నేను పట్టించుకోను. ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరినోటి నుండి వినాలన్నదే నా లక్ష్యం. కొందరు హీరోయిన్లు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తారు. వారి బాటలోనే నేను కూడా అడుగులు వేస్తున్నా. వ్యక్తిగతంలో నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. నటిగా మాత్రం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి నాలుగు సినిమాలు చేస్తున్నా.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shivani Nagaram | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న అచ్చ తెలుగు హీరోయిన్
మే 9, 2026

Telugu OTT | ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ – తండ్రి బిజినెస్ కొడుకు ప్రేమకు అడ్డొస్తే
మార్చి 27, 2026

Tollywood | తగ్గేదేలే… టాలీవుడ్‌లో దూసుకుపోతున్న తెలుగు భామలు… ‘లోకల్’ బ్యూటీల రచ్చ
మార్చి 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



