త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Shivaji | నాపై ఇండ‌స్ట్రీలో వ్య‌తిరేక‌త ఉంది – కావాల్సిన వాళ్లే కుట్ర చేశారు – శివాజీ కామెంట్స్ వైర‌ల్‌…

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల‌పై చేసిన అస‌భ్య‌క‌ర కామెంట్ల‌కు సంబంధించి శ‌నివారం యాక్ట‌ర్ శివాజీని మ‌హిళా క‌మిష‌న్ విచారించింది. ఈ విచార‌ణ‌పై శివాజీ రియాక్ట్ అయ్యారు. మ‌హిళా క‌మిష‌న్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌వివ‌రంగా స‌మాధానాలు చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

N

Entertainment | Published On Dec 27, 2025, 6.17 pm IST

Actor Shivaji |  నాపై ఇండ‌స్ట్రీలో వ్య‌తిరేక‌త ఉంది – కావాల్సిన వాళ్లే కుట్ర చేశారు – శివాజీ కామెంట్స్ వైర‌ల్‌…
Advertisement

Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్‌ల‌పై చేసిన అనుచిత‌ కామెంట్ల‌కు సంబంధించి యాక్ట‌ర్ శివాజీని తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ శ‌నివారం విచారించింది. ఇటీవ‌ల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిండైన డ్రెస్సుల్లోనే హీరోయిన్లు అందంగా ఉంటార‌ని, సామాన్లు క‌నిపించే దుస్తుల్లో కాద‌ని శివాజీ అన్నారు. ఈ వ్యాఖ్య‌లు వివాదానికి దారితీయ‌డంలో శివాజీకి మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు పంపించింది. ఈ నోటీసుల‌కు సంబంధించి శ‌నివారం మ‌హిళా క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు శివాజీ. ఈ విచార‌ణ అనంత‌రం శివాజీ మీడియాలో మాట్లాడారు మ‌హిళా క‌మిష‌న్ నోటీసుల‌కు సంబంధించి స‌వివ‌రంగా స‌మాధానం ఇచ్చాన‌ని శివాజీ అన్నారు. "దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను చెప్పిన మాట‌లు కొంత‌మంది త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ కామెంట్ల‌పై మ‌హిళా క‌మిష‌న్ నాకు నోటీసులు పంపించింది. ఆ నోటీసుల‌కు స‌మాధానం స‌వివ‌రంగా ఇచ్చాను. నా మాట‌ల వెనుక ఉన్న‌ ఉద్దేశం ఏమిటో స‌భ్యుల‌కు విన్న‌వించాను. నా మాట‌ల్లో కొన్ని అభ్యంత‌ర క‌ర‌మైన ప‌దాలు దొర్లాయి. ఎవ‌రైతే ఆ మాట‌ల‌కు బాధ‌ప‌డ్డారో వారి కోణం నుంచి కూడా న‌న్ను ఛైర్ ప‌ర్స‌న్ ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నింటికి స‌మాధానం చెప్పాను" అని శివాజీ అన్నారు.

వివ‌ర‌ణ ఇచ్చాను...

ఈ వివాదాన్ని ఇంత‌టితో ఆపేద్దామ‌ని మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌తో చెప్పాన‌ని శివాజీ అన్నారు. "ఎవ‌రిని హ‌ర్ట్ చేయాల‌ని, ఇబ్బంది పెట్టాల‌ని ఈ కామెంట్లు చేయ‌లేదు. జ‌రిగిన సంఘ‌ట‌న చూసి మాట్లాడాను. నా మాట‌ల్లో త‌ప్పుడు ప‌దాలు దొర్లాయి. దానికి అంద‌రికి వివ‌ర‌ణ ఇవ్వ‌డ‌మే కాకుండా క్ష‌మాప‌ణ‌లు చెప్పాను. ఇదే విష‌యం మ‌హిళా క‌మిష‌న్ ఛైర్స్ ప‌ర్స‌న్‌తో పాటు స‌భ్యుల‌కు చెప్పాన‌ని" శివాజీ అన్నారు.

వ్య‌తిరేక‌త ఉంది ...

"ఇండ‌స్ట్రీలో నాపై వ్య‌తిరేక‌త ఉంది. ఎందుకో తెలియ‌దు. నేనంటే చాలా మందికి కోపం ఉంది. ఇండ‌స్ట్రీలోకి నేను అడుగుపెట్టి ముప్ఫై ఏళ్ల‌య్యింది. ఏ రోజు ఎవ‌రిని ఇబ్బంది పెట్ట‌లేదు. నాతో మంచిగా ఉన్న‌ట్లుగా న‌టిస్తూనే కుట్ర‌లు చేశారు. ఆవేశంలో మాట్లాడిన మాట‌ల‌ను ప‌ట్టుకొని కావాల్సిన వాళ్లే న‌న్ను ఇబ్బందులు పెట్టారు. నాపై అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారో తెలియ‌డం లేదు. ఎవ‌రు ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నా నాకు అభ్యంత‌రం లేదు" అని శివాజీ ఆవేద‌న‌కు లోన‌య్యారు.
శివాజీని మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులు దాదాపు గంట‌న్న‌ర పాటు విచారించిన‌ట్లు స‌మాచారం. శివాజీ వాఖ్య‌లు మ‌హిళ‌ల గౌర‌వం, వారి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే విధంగా ఉన్నాయంటూ శివాజీపై మ‌హిళా క‌మిష‌న్ ఫైర్ అయిన‌ట్లు స‌మాచారం. డ్రెస్‌ల ఆధారంగా మ‌హిళ వ్య‌క్తిత్వాన్ని త‌క్కువ చేయ‌డం స‌రికాదంటూ హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది. మ‌రోసారి ఇలాంటి కామెంట్లు పున‌రావృతం కాకుండా చూసుకుంటాన‌ని మ‌హిళా క‌మిష‌న్‌కు శివాజీ హామీ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement