George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ – ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న జార్జ్ క్రిష్ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జార్జ్ క్రిష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Entertainment | Published On Aug 14, 2026, 3.32 pm IST
నారి నారి నడుమ మురారి సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ట్రాయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి కంటిన్యూ చేయబోతున్నాడు. జార్జ్ క్రిష్ సినిమాతో వచ్చే ఏడాది పండుగ బరిలో నిలవబోతున్నాడు శర్వానంద్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్‌లో రూపొందుతోన్న జార్జ్ క్రిష్ మూవీ శుక్రవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఓపెనింగ్ ఈవెంట్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో శర్వానంద్‌ఫై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
సంక్రాంతికి రిలీజ్...
శ్రీనువైట్ల గత సినిమాల తరహాలోనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. వినోదంతో పాటు అంతర్లీనంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. కాగా ఓపెనింగ్ రోజే జార్జ్ క్రిష్ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా చెప్పేశారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా విడుదలకానున్నట్లు వెల్లడించారు. ఈ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర జార్జ్ క్రిష్ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రీతి ముకుందన్
జార్జ్ క్రిష్‌లో శర్వానంద్‌కు జోడీగా ప్రీతి ముకుందన్, భాగ్యశ్రీ బోర్సేలలో ఒకరు హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే హీరోయిన్‌ను ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జార్జ్ క్రిష్‌తో పాటు భోగి సినిమా చేస్తున్నాడు శర్వానంద్. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Viswanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ – సూర్య, మమితా బైజు లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?
ఆగస్టు 14, 2026

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 13, 2026

Janhvi Kapoor | నో గ్లామర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ – దీపికా, రష్మికలకు ధీటుగా!
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
- ●MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు
- ●Kiara Advani | కియారా అద్వానీకి బాడీగార్డ్‌లా మారిన యశ్ - ప్రెగ్నెన్సీతోనే షూటింగ్
- ●Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- ●WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
- ●Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్డేట్..

Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు

Kiara Advani | కియారా అద్వానీకి బాడీగార్డ్‌లా మారిన యశ్ - ప్రెగ్నెన్సీతోనే షూటింగ్

Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం



