త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharwanand | యాక్ష‌న్ షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ భోగి – పుష్ప 2 సెంటిమెంట్ ప్లేస్‌లో షూటింగ్‌

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌తో రంప‌చోడ‌వ‌రం అడ‌వులు ఫేమ‌స్ అయ్యాయి. పుష్ప షూటింగ్ జ‌రిగిన ప్రాంతంలోనే తాజాగా శ‌ర్వానంద్ భోగి షూటింగ్ జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 14, 2026, 9.00 pm IST

Sharwanand | యాక్ష‌న్ షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ భోగి – పుష్ప 2 సెంటిమెంట్ ప్లేస్‌లో షూటింగ్‌
Advertisement

Sharwanand | నారి నారి న‌డుమ మురారితో పాటు బైక‌ర్ సినిమాల‌తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెద్ద విజ‌యాల‌ను అందుకున్నాడు శ‌ర్వానంద్‌. ఈ స‌క్సెస్‌ల‌తో రెట్టించిన ఉత్సాహంతో త‌దుప‌రి సినిమాల కోసం సిద్ధ‌మ‌వుతోన్నాడు. ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో భోగి పేరుతో ఓ పీరియాడియ‌ల్ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు శ‌ర్వానంద్‌. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్త‌య్యింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను రివీల్ చేశారు. పుష్ప 2 షూటింగ్‌ను జ‌రుపుకున్న ప్రాంతాల్లో భోగి చిత్రీక‌ర‌ణను జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

రంప‌చోడ‌వ‌రంలో...

మంగ‌ళ‌వారం నుంచి భోగి లేటెస్ట్ షెడ్యూల్ మొద‌లైంది. ఈ షెడ్యూల్‌లో రాజ‌మండ్రితో పాటు రంప‌చోడ‌వ‌రం అడ‌వుల్లో హై ఇంటెన్స్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప 2 సినిమాతో రంప‌చోడ‌వ‌రం ఫేమ‌స్ అయ్యింది. ఇక్క‌డి అడ‌వుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ చాలా వ‌ర‌కు జ‌రిగింది. పుష్ప‌, పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిల‌వ‌డంలో ఇక్క‌డి లోకేష‌న్లు కొంత కార‌ణ‌మ‌య్యాయి. రంప‌చోడ‌వ‌రంలోని అడ‌వుల్లోనే భోగి షూటింగ్‌ను చేయ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో శ‌ర్వానంద్‌పై ఫైట్ మాస్ట‌ర్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ సార‌థ్యంలో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచుతాయ‌ని అన్నారు.

తెలంగాణ స‌రిహ‌ద్దు క‌థ‌తో...

భోగి సినిమాకు “ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ట్యాగ్ లైన్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక సరికొత్త అవ‌తారంలో క‌నిపించ‌బోతున్నారు. 1960 కాలం నాటి క‌థ‌తో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆనాటి కాలాన్ని వాస్త‌విక కోణంలో రీక్రియేట్ చేస్తోన్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌...

భోగి మూవీలో శ‌ర్వానంద్‌కు జోడీగా అనుప‌మ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక‌ర్ అందిస్తున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 28 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భోగి రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement