త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ – దృశ్యంకు మించిన ట్విస్ట్‌ల‌తో

మ‌ల‌యాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మ‌ల‌యాళం మూవీ ద్రీదం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూన్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. షేన్ నిగ‌మ్ హీరోగా న‌టించిన ఈ మూవీ మ‌ల‌యాళంతో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jun 2, 2026, 6.02 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ – దృశ్యంకు మించిన ట్విస్ట్‌ల‌తో
Advertisement

Malayalam OTT | షేన్ నిగ‌మ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ద్రీదం ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. క్రైమ్ ఇన్వెస్టిగేట్‌ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి మార్టిన్ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కృష్ణ‌ప్ర‌భ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో మాథ్యూ వ‌ర్గీస్‌, ర‌మేష్ కొట్టాయం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

జియో హాట్‌స్టార్‌లో...

తాజాగా ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూన్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు జియో హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది.రిలీజ్‌కు ముందు దృశ్యం లాంటి థ్రిల్ల‌ర్ మూవీ అంటూ ద్రీదంపై ప్ర‌చారం జ‌రిగింది. కానీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు తేలిపోవ‌డం, ఉత్కంఠ‌గా క‌థ‌ను చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోవ‌డంతో ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఏడుకోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నాలుగు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. జీతూ జోసెఫ్ వ‌ద్ద దృశ్యం 2తో పాటు ప‌లు సినిమాల‌కు మార్టిన్ జోసెఫ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.

మ‌ర్డ‌ర్ కేసు ఇన్వెస్టిగేష‌న్‌...

విజ‌య్ రాధాకృష్ణ‌న్ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. అట‌వీ ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఊరిలో తొలి పోస్టింగ్ వ‌స్తుంది. ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సాఫీగా సాగిపోతున్న విజ‌య్ జీవితాన్ని మ‌ర్డ‌ర్ కేసు మ‌లుపుతిప్పుతుంది. ఊరి పొలిమేర‌లో ఓ డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆ డెడ్‌బాడీ గురించి విచార‌ణ‌లో మ‌రో రెండు మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. చ‌నిపోయిన వ్య‌క్తుల‌కు ఓ దొంగ‌త‌నంతో సంబంధం ఉంద‌నే నిజం కూడా తెలుస్తుంది? చ‌నిపోయిన‌వాళ్లు ఎవ‌రు? హంత‌కుడిని విజ‌య్ ఎలా ప‌ట్టుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement