Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
తమిళంలో నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మిస్టర్ ఎక్స్ మూవీ కేవలం ఐదు కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకొని డిజాస్టర్‌గా నిలిచింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On May 14, 2026, 2.37 pm IST
Action OTT | తమిళంలో భారీ అంచనాల నడుమ రిలీజైన మల్టీస్టారర్ మూవీ మిస్టర్ ఎక్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు మను ఆనంద్ దర్శకత్వం వహించాడు.
జియో హాట్ స్టార్‌లో...
థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే మిస్టర్ ఎక్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి జియో హాట్‌స్టార్‌లో యస్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అయ్యింది.
రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్స్‌తో కోలీవుడ్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ కాన్సెప్ట్‌లో ఆసక్తిని లోపించడం, ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లే కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం ఐదు కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు పెద్ద ఎత్తునే నష్టాలను తెచ్చిపెట్టింది.
అణుబాంబు ఎటాక్...
ప్లూటోనియం క్యాప్సూల్స్‌తో కూడిన శక్తివంతమైన అణుబాంబును రాణా అనే వ్యక్తి దొంగిలిస్తాడు. చెన్నైలో జరుగబోయే జీ 20 సదస్సును లక్ష్యంగా చేసుకొని రాణా భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నాడని రా ఏజెంట్లకు తెలుస్తుంది. రాణా కుట్రలను అడ్డుకొని జీ 20 సదస్సును ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించే బాధ్యతను సీక్రెట్ ఏజెంట్స్ గౌతమ్, అమరన్ చేపడతారు. వారిద్దరు కలిసి రాణాను ఎలా ఎదుర్కొన్నారు. గౌతమ్, అమరన్‌లకు సాయం చేసిన అదితి, ఇందిరా వర్మ ఎవరు? రా ఏజెంట్ అయిన అమరన్...రానా టీమ్‌లో అతడు నమ్మిన బంటుగా ఎలా జాయిన్ అయ్యాడు? అన్నదే ఈ మూవీ కథ.
మిస్టర్ ఎక్స్ మూవీలో అతుల్యా రవి, అనఘా, రైజా విల్సన్ హీరోయిన్లుగా కనిపించారు. ధిబు నినన్ థామస్ సంగీతం అందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



