త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ చేస్తుంది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న‌

Pawan Kalyan | 2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణలో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. బీజేపీ, టీడీపీ క‌లిసొస్తాయో లేదో తెలియ‌ద‌న్నారు. మంగ‌ళ‌వారం త‌న నివాసం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర‌మంతా నేనే తిరుగుతాన‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌పై మాట్లాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

P

Telangana | Published On Jun 2, 2026, 6.15 pm IST

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ చేస్తుంది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న‌
Advertisement

Pawan Kalyan | 2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణలో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. బీజేపీ, టీడీపీ క‌లిసొస్తాయో లేదో తెలియ‌ద‌న్నారు. మంగ‌ళ‌వారం త‌న నివాసం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర‌మంతా నేనే తిరుగుతాన‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌పై మాట్లాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో తెలంగాణ కూడా అంత‌ర్భాగ‌మేన‌న్నారు. దేశంలో ఎక్క‌డైనా తిరిగే హ‌క్కు ఉంటుంద‌న్నారు. వేరే రాష్ట్రానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ ఉండాలా ? ద‌మ్ముంటే నేను తెలంగాణ‌కు రావొద్ద‌ని అసెంబ్లీలో తీర్మానం చేయాల‌ని స‌వాల్ విసిరారు. దీనిపై రాహుల్‌గాంధీ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. నేనెప్పుడూ తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా స్పందించ‌లేద‌ని, రాష్ట్ర విభ‌జ‌న బిల్లును ఆమోదించిన విధానాన్నే వ్య‌తిరేకించాన‌న్నారు. మీరెవ‌రు న‌న్ను బెదిరించ‌డానికి ? నేను చెరువును క‌బ్జా చేశానా? అదే నిజ‌మైతే ప్ర‌భుత్వానికి రాసిస్తాన‌న్నారు. దాడి చేస్తే చేయండి.. అంద‌రికీ తెలియాల‌నే నా ఇంటి ముందే విలేక‌రుల స‌మావేశాన్ని పెట్టాన‌న్నారు. మీరు భ‌య‌పెట్టే కొద్దీ నేను మ‌రింత గ‌ట్టిప‌డుతున్నాన‌న్నారు.

వైఎస్ ఉన్న‌ప్పుడు లేవ‌ని నోళ్లు ఇప్పుడు లేస్తున్న‌య్‌..

తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన‌వాళ్లే ఇప్పుడు ప‌ద‌వుల్లో కూర్చున్నార‌ని, వైఎస్ఆర్ హ‌యాంలో లేవ‌ని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయ‌న్నారు. గ‌ద్ద‌ర్ బ‌తికి ఉన్న‌ప్పుడు వీరంతా ఎటుపోయార‌ని ప్ర‌శ్నించారు. చ‌చ్చిపోవ‌డానికి సిద్ధ‌ప‌డే పార్టీ పెట్టాన‌ని, నేను ప్రెస్‌మీట్ పెడితే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుందా? అంటూ నిల‌దీశారు. పెచ్చుమీరుతున్న ప్రాంతీయ‌వాదంపై కేంద్రం దృష్టి సారించాల‌ని కోరారు. నా ప్రెస్ మీట్ కు అనుమ‌తించ‌క‌పోవ‌డంపై బీజేపీ నాయ‌కులు ఎందుకు స్పందించ‌లేదో నాకు తెలియ‌ద‌ని, నాకు ఏపీలోనే దిక్కులేదు.. తెలంగాణ‌లో సీఎం అవుత‌నా? అని ప్ర‌శ్నించారు. మా పార్టీ ఎలా న‌డ‌వాలో చెప్ప‌డానికి వాళ్లు ఎవ‌రు? 2029 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ప్ప‌కుండా పోటీ చేస్తుంది? బీజేపీ మాతో క‌లిసివ‌స్తుందో లేదో తెలియ‌దు. జ‌న‌సేన మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీ చేస్తుంద‌న్నారు. పున‌ర్నిర్మాణ స‌భ పేరుతో మా నేత‌లు పెట్టారు.. నేను పెట్ట‌లేదు.. గ‌తంలో మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం వ‌చ్చినా చేయ‌లేద‌ని తెలిపారు. తెలంగాణలో మావాళ్లు గెలిస్తే చాలు.. నేను ప‌ద‌వులు కోరుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఉగ్ర‌వాదం కంటే ప్రాంతీయ‌వాదం ప్ర‌మాద‌క‌రం

తెలంగాణ నేల నేర్పించిన విలువ‌ల‌నే పార్టీ సిద్ధాంతాలుగా పెట్టుకున్నాన‌న్నారు. ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బ‌ల‌హీన‌ప‌రిస్తే జ‌న‌సేన అంగీక‌రించ‌ద‌ని, ప్రాంతీయ‌వాదం తీసుకువ‌స్తే దేశ సుస్థిర‌త దెబ్బ‌తింటుంద‌న్నారు. ఉగ్ర‌వాదం కంటే ప్రాంతీయ‌వాదం హానికరమ‌న్నారు. తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం వ్య‌తిరేకించాయ‌ని.. సీపీఎం, ఎంఐఎంను మీరెందుకు ప్ర‌శ్నించ‌రు? జ‌న‌సేన‌ను మాత్రం ఎందుకు ప్ర‌శ్నిస్తున్న‌రు? అంటూ నిల‌దీశారు. నేను ప్రెస్‌మీట్ పెడితే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య అవుతుందా? మ‌ళ్లీ గ‌డీల పాల‌న తీసుకువ‌స్తారా? అంటూ ప్ర‌శ్నించారు.

హైవేకు బూరుగుల పేరు పెట్టాలి..

రేవంత్‌రెడ్డి సీఎం అయితే శుభాకాంక్ష‌లు చెప్పాన‌న్నారు. మాపై విమ‌ర్శ‌ల వెనుక రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఉన్నార‌ని అనుకోన‌ని, పెచ్చుమీరుతున్న ప్రాంతీయ‌వాదంపై కేంద్రం దృష్టిపెట్టాల‌ని సూచించారు. తెలంగాణ‌కు వ‌ల‌స‌లు త‌గ్గాలంటే ఏపీ యువ‌త‌కు ఉద్యోగాలి రావాల‌ని, ఏపీ యువ‌త‌కు ఉపాధి పెంచేందుకు కృషి చేస్తున్నాన‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఐక్య‌త‌కు బూర్గుల రామ‌కృష్ణారావు చిహ్నమ‌ని, బూర్గుల విగ్ర‌హాని ఏపీ-తెలంగాణ హైవేపై పెట్టాలి. హైవేకు కూడా ఆయ‌న పేరే పెట్టాల‌న్నారు. 11 రోజులు అన్నం తిన‌లేదంటే తెలంగాణ వ‌చ్చినందుకు కాద‌ని, విభ‌జించిన తీరుకేన‌న్నారు. తెలంగాణ వ‌చ్చినందుకు 11 రోజులు అన్నం తిన‌లేద‌న‌డం స‌రికాద‌న్నారు. తెలంగాణ నాయ‌కులు ఎన్నిసార్లు ఆంధ్రావాళ్ల‌ను తిట్ట‌లేద‌ని.. తెలంగాణ‌లో ప‌ని ఇప్పుడే మొద‌లుపెట్టాం.. ప్ర‌జ‌లు న‌మ్మేవ‌ర‌కు ప‌ని చేస్తామ‌న్నారు.

Advertisement
Advertisement