త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం

Vemula Veeresham | తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడికి రావాలని హితవు పలికారు.

S

Telangana | Published On Jun 2, 2026, 6.13 pm IST

Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం
Advertisement

Vemula Veeresham | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. తెలంగాణలో విలేకరుల సమావేశం పెట్టాలన్నా, సమావేశం పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు.

ఏపీలో పార్ట్ టైమ్ లీడ‌ర్..

ఒకసారి భగత్ సింగ్ అన్నాడని, చేగువేరా అన్నాడని, ఇప్పుడేమో వాళ్లని పక్కనపెట్టాడని దుయ్యబట్టారు. ఏపీలోనే ఆయన పార్ట్ టైమ్ పొలిటికల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఏదో అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొట్టే పవన్ తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడికి రావాలని హితవు పలికారు.

Advertisement
Advertisement