IT Returns | ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 తప్పనిసరిగా ఉండాలా..?
IT Returns | దేశవ్యాప్తంగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు ఆ శాఖ పలు ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచింది. అయితే ఇది మాత్రమే కాకుండా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఫామ్ 16 ఆధారంగా తమ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తుంటారు.
IT Returns | దేశవ్యాప్తంగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు ఆ శాఖ పలు ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచింది. అయితే ఇది మాత్రమే కాకుండా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఫామ్ 16 ఆధారంగా తమ ఐటీఆర్‌ను ఫైల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ఫామ్ 16 ఆధారంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసేందుకు వారు ఎదురు చూస్తున్నారు. ఫామ్ 16 వల్ల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమకు లభించే వేతనం, టీడీఎస్, పన్ను తగ్గింపులు, పన్ను లెక్కింపు వంటి అన్ని వివరాలను ఒకే పత్రం ద్వారా పొందేందుకు వీలుంటుంది. దీంతో ఐటీఆర్‌ను ఫైల్ చేయడం సులభతరం అవుతుంది. అయితే ఫామ్ 16 విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
అనేక వివరాలు ఒకే పత్రంలో..
క్లియర్ ట్యాక్స్ పన్ను చెల్లింపు నిపుణుడు చాందినీ ఆనందన్ మాట్లాడుతూ ఫామ్ 16 వల్ల ఐటీఆర్ ను దాఖలు చేయడం చాలా సులభతరం అవుతుందన్నారు. పన్ను చెల్లింపుదారులకు తమకు కావల్సిన సమాచారం మొత్తం ఒకే పత్రంలో లభిస్తుంది. ఫామ్ 16లో వేతనం, టీడీఎస్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. వీటితోపాటు ట్యాక్స్ పేయర్లు తమ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను సమర్పించి చాలా సులభంగా ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయవచ్చు. ఫామ్ 16ను ఒక రకంగా చెప్పాలంటే టీడీఎస్ సర్టిఫికెట్ లాంటిదని ఆనందన్ అన్నారు. ఇది సంస్థలు తమ ఉద్యోగులకు అందించే ఓ టీడీఎస్ పత్రం అన్నారు. ఇందులో ఉద్యోగులకు వేతనంలో విధించే పన్ను, టీడీఎస్ నమోదు వంటి వివరాలు ఉంటాయన్నారు.
పూర్తి వివరాలు తెలుస్తాయి..
ఫామ్ 16 ద్వారా ఒక ఉద్యోగి తనకు లభించే వేతనానికి చెందిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పన్ను మినహాయిపు, చెల్లింపులు, తగ్గింపులు, పన్ను విధింపుకు గురయ్యే ఆదాయం వంటి వివరాలు లభిస్తాయి. ఉద్యోగులు ఈ వివరాలను ఫామ్ 16 ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఉద్యోగులు తమకు ఫామ్ 16 లభించకపోతే తాము పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించి ఫామ్ 16ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి భిన్న కంపెనీలు లేదా సంస్థల్లో పనిచేస్తే తరువాత ఐటీఆర్ సమర్పించేందుకు అన్ని సంస్థల నుంచి ఫామ్ 16లను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

రెండు భాగాలుగా..
ఇక ఫామ్ 16 సాధారణంగా పార్ట్ ఎ, పార్ట్ బి పేరిట రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఎ భాగాన్ని ఆదాయపు పన్ను శాఖ కోసం జనరేట్ చేసి ఇస్తారు. ఇందులో టీడీఎస్ వివరాలు, ఉద్యోగి వేతనం, టీడీఎస్ నమోదు మొత్తం వంటి వివరాలు ఉంటాయి. అలాగే ఉద్యోగి పేరు, చిరునామా, పాన్, టాన్ వివరాలు, సంస్థ పేరు, సంస్థ పాన్, త్రైమాసిక టీడీఎస్ నమోదు వివరాలు, అసెస్‌మెంట్ సంవత్సరం, ఉద్యోగి కాల వ్యవధి, టీడీఎస్ రశీదు నంబర్ తదితర సమాచారం కూడా ఉంటుంది. ఇక పార్ట్ బిలో వేతనం, పన్ను లెక్కింపు, హెచ్ఆర్ఏ, ఎల్‌టీఏ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెన్షన్ వంటి వివరాలను ఇస్తారు. అలాగే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్లు 80సి, 80డి, 80సిసిడిల ప్రకారం పొందే మినహాయింపులు, ఎడ్యుకేషన్ సెస్, సర్ చార్జి, ట్యాక్స్ లయబిలిటీ లేదా రీఫండ్ వంటి వివరాలను కూడా పొందు పరుస్తారు.
ఫామ్ 16 లేకపోతే..
అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఫామ్ 16 లేకుండా ఐటీఆర్‌ను ఫైల్ చేయవచ్చా అని. అయితే ఇందుకు నిపుణులు సమాధానం చెప్పారు. ఫామ్ 16 లేకుండా ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఐటీఆర్‌ను దాఖలు చేసేందుకు ఫామ్ 16 తప్పనిసరి ఏమీ కాదు. కానీ అది ఉంటే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ను సమర్పించడం చాలా తేలికవుతుంది. దీంతో వేతనం పూర్తి వివరాలు, టీడీఎస్, పన్ను మినహాయింపులు, ఇతర సమాచారాన్ని తప్పులు లేకుండా ఐటీఆర్‌లో ఇవ్వవచ్చు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా లేదా ఐటీ శాఖ నుంచి నోటీసులు రాకుండా ఉంటాయి. ఫామ్ 16 ఐటీఆర్ సమర్పణకు తప్పనిసరి కాకపోయినా, అది ఉంటే రిటర్న్స్ దాఖలు చేయడం చాలా సులభంగా మారుతుంది.
సంబంధిత వార్తలు

IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాల్సిందే..
మే 26, 2026

Electric Vehicles | ఎలక్ట్రిక్ వాహనాలను కొంటే పన్ను మినహాయింపు పొందవచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
మే 23, 2026

IT Returns | రూ.12.75 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ.. అయినా ఐటీఆర్ తప్పనిసరి..
మే 20, 2026
తాజావార్తలు
- ●Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన
- ●Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం
- ●Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - దృశ్యంకు మించిన ట్విస్ట్‌లతో
- ●ATA | ఆటా తెలుగు మహాసభలకు రండి.. హరీశ్‌రావును ఆహ్వానించిన బృందం సభ్యులు
- ●Shambipur Raju | ఇదేనా అమరులకిచ్చే గౌరవం?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
- ●Oppo Instagram | క్రియేటర్ల కోసం ఒప్పో-ఇన్స్టాగ్రామ్ సరికొత్త ప్రోగ్రామ్.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయవచ్చు..

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన

Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - దృశ్యంకు మించిన ట్విస్ట్‌లతో

ATA | ఆటా తెలుగు మహాసభలకు రండి.. హరీశ్‌రావును ఆహ్వానించిన బృందం సభ్యులు



