త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATA | ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రండి.. హ‌రీశ్‌రావును ఆహ్వానించిన బృందం స‌భ్యులు

ATA | ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రావాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీష్ రావును ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా కోరారు. హ‌రీశ్‌రావు సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.

S

Telangana | Published On Jun 2, 2026, 5.56 pm IST

ATA | ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రండి.. హ‌రీశ్‌రావును ఆహ్వానించిన బృందం స‌భ్యులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆటా తెలుగు మ‌హాస‌భ‌ల‌కు రావాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీష్ రావును ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఆటా బృందం స‌భ్యుల‌తో వెళ్లి హ‌రీశ్‌రావును క‌లిసి ఆహ్వానించారు. వ‌చ్చే జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు మహాసభల‌కు హాజరు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హ‌రీశ్‌రావు సానుకూలంగా స్పందించిన‌ట్లు జ‌యంత్ చ‌ల్లా తెలిపారు.

ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను హరీష్ రావుకు వివరించినట్లు ఆయ‌న పేర్కొన్నారు. అమెరికాలోని తెలుగువారి పరిస్థితులపై చర్చించిన‌ట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిచింద‌ని గుర్తు చేశారు. ఉద్యమంలో NRIలు పోషించిన‌ పాత్రపై కూడా చర్చించినట్లు వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్యమంలో NRI లు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడగట్టారో వివరించారు.

హరీశ్‌ రావును కలిసిన వారిలో నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ఇండియా కో ఆర్డినేటర్ వేణు సంకినేని, ఈశ్వర్ బండా ఉన్నారు.

Advertisement
Advertisement