త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comedy OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ – సినిమా మొత్తం విమానంలోనే!

క‌మెడియ‌న్ స‌త్య హీరోగా న‌టించిన జెట్ లీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మే 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీకి రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On May 17, 2026, 6.34 pm IST

Comedy OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ – సినిమా మొత్తం విమానంలోనే!
Advertisement

Comedy OTT |  టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బిజీయెస్ట్ క‌మెడియ‌న్‌గా కొన‌సాగుతోన్నాడు స‌త్య‌. ఇటీవ‌ల రిలీజైన జెట్‌లీతో హీరోగా మారాడు. క‌మెడియ‌న్‌గా ప‌లు సినిమాల‌తో న‌వ్వించిన స‌త్య హీరోగా మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చేయ‌లేక‌పోయారు. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన జెట్‌లీ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

మూడు వారాల్లోనే...

థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు వారాల్లోనే జెట్‌లీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మే 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జెట్‌లీ విడుద‌ల తేదీని రివీల్ చేసిన జియో హాట్‌స్టార్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్‌...

జెట్‌లీ సినిమాకు మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రియా సింఘా హీరోయిన్‌గా న‌టించ‌గా...వెన్నెల‌కిషోర్‌, అజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు. బ్యాంకు స్కామ్‌ల కాన్సెప్ట్‌కు వినోదాన్ని జోడించి ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను రాసుకున్నాడు. జెట్‌లీ సినిమా మొత్తం ఫ్లైట్‌లోనే సాగ‌డం గ‌మ‌నార్హం. కామెడీ ఆశించిన స్థాయిలో పండ‌క‌పోవ‌డం, తాను అనుకున్న క‌థ‌ను థ్రిల్లింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ కావ‌డంతో జెట్‌లీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ఫ్లైట్ జ‌ర్నీ...

ప్ర‌జాప‌తి పేరుతో బ్యాంకు పెట్టి జ‌నాల‌ను మోసం చేసి విదేశాల‌కు పారిపోతాడు బిజినెస్‌మెన్ ప్ర‌జాప‌తి (అజ‌య్‌). ప్ర‌జాప‌తి దుబాయ్‌లో ఉన్నాడ‌ని క‌నిపెట్టిన ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) అత‌డిని ఫ్లైట్‌లో ఇండియాకు తీసుకురావాల‌ని అనుకుంటుంది. ఈ ఫ్లైట్ జ‌ర్నీలోనే శివానీ బారి నుంచి త‌ప్పించుకోవాల‌ని త‌న మ‌న‌షుల‌తో క‌లిసి ప్ర‌జాప‌తి ప్లాన్ చేస్తాడు. మ‌రోవైపు అత‌డిని చంపేందుకు ఓ సీక్రెట్ టీమ్ అదే ఫ్లైట్‌లోకి ఎక్కుతుంది. వారంద‌రి బారి నుంచి ప్ర‌జాప‌తిని కాపాడిన వేద‌వ్యాస్ (స‌త్య‌) ఎవ‌రు? అత‌డు ఆ ఫ్లైట్‌లోకి ఎలా వ‌చ్చాడు? ప్ర‌జాప‌తి చేతిలో మోస‌పోయిన జ‌నాల‌కు వేద‌వ్యాస్ ఎలా సాయం చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement