త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు – పోటీ గ‌ట్టిగానే ఉందిగా?

Tollywood | ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు నిల‌వ‌నున్నాయి. నాలుగు స్ట్రెయిట్ సినిమాలు, మూడు డ‌బ్బింగ్ మూవీస్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో రూపొందిన ఈ సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Dec 22, 2025, 3.52 pm IST

Tollywood | ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో ఏడు సినిమాలు – పోటీ గ‌ట్టిగానే ఉందిగా?

టాలీవుడ్

Advertisement

Tollywood | 2025 ఏడాది చివ‌రి వారంలో బాక్సాఫీస్ (Box Office) పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ శుక్ర‌వారం ఏడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. నాలుగు స్ట్రెయిట్ సినిమాలు, మూడు డ‌బ్బింగ్ మూవీస్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. అన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే కావ‌డంతో ఈ ఫ్రైడే బాక్సాఫీస్ క్లాష్ ఉత్కంఠ‌ను పంచుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడు సినిమాల‌కు సంబంధించి రిలీజ్ చేసిన టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ అన్నింటికి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్‌లో ఎవ‌రికి వారే త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. ఈ ఏడుగురిలో బాక్సాఫీస్ విన్న‌ర్‌గా ఎవ‌రూ నిలుస్తార‌న్న‌ది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 ఛాంపియ‌న్‌...

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ మేక హీరోగా న‌టిస్తున్న ఛాంపియ‌న్ మూవీ ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను 45 కోట్ల బ‌డ్జెట్‌తో స్వ‌ప్న సినిమాస్ సంస్థ నిర్మించింది. నిజాం కాలం నాటి క‌థ‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ వారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాల్లో ఛాంపియ‌న్‌పైనే ఎక్కువ‌గా బ‌జ్ నెల‌కొంది. ఛాంపియ‌న్‌ ఓటీటీ రైట్స్ 16 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

శంబాల‌...

హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) ఈ వీక్ శంబాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి యుగంద‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అర్చ‌న్ అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నఈ సినిమాలో స్వాసిక విజ‌య్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ట్రైల‌ర్, టీజ‌ర్ పెద్ద హిట్ట‌వ్వ‌డంతో శంబాల‌కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఆదికి హిట్టు ద‌క్క‌డం గ్యారెంటీ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాయి.

హార‌ర్ మూవీ...

డిసెంబ‌ర్ 12న రిలీజ్ కావాల్సిన హార‌ర్ మూవీ ఈషా కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ హార‌ర్ మూవీలో హెబ్బా ప‌టేల్‌, త్రిగుణ్‌, అఖిల్ రాజ్‌, సిరి హ‌నుమంతు హీరోహీరోయిన్లుగా న‌టించారు. లిటిల్ హార్ట్స్‌, రాజు వెడ్స్ రాంబాయితో స‌క్సెస్‌ల‌ను అందుకున్న ప్రొడ్యూస‌ర్లు బ‌న్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ చిన్న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కుల వివ‌క్ష నేప‌థ్యంలో రూపొందిన దండోరా కూడా శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతుంది. శివాజీ, నవ‌దీప్‌, బిందుమాధ‌వి వంటి టాలెంటెడ్ యాక్ట‌ర్లు న‌టించిన ఈసినిమా కావ‌డంతో దండోరాకు థియేట‌ర్లు బాగానే దొరికాయి. హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన దండోరాకు ముర‌ళీ కాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
ఈ స్ట్రెయిట్‌ సినిమాల‌తో పాటుగా మోహ‌న్ లాల్ మ‌ల‌యాళ మూవీ వృష‌భ‌, శివ‌రాజ్‌కుమార్ ఉపేంద్ర క‌న్న‌డ సినిమా 45తో పాటు మ‌రో కిచ్చా సుదీప్ మార్క్ తెలుగులో డిసెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement