Shambhala Review | శంబాల రివ్యూ – మైథాలజీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది? ఆది సాయికుమార్‌కు హిట్టు దక్కిందా?
ఆది సాయికుమార్ హీరోగా నటించిన శంబాల మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Dec 25, 2025, 8.05 am IST
శంబాల మూవీ రివ్యూ
Shambhala Review | ఆది సాయికుమార్ హిట్టు అందుకొని చాలా ఏళ్లు అవుతోంది. విజయం కోసం రూటు మార్చిన ఆది మైథాలజీ బాట పట్టారు. మిస్టిక్ థ్రిల్లర్ కథతో ఆది చేసిన లేటెస్ట్ మూవీ శంబాల గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి యుగందర్ ముని దర్శకత్వం వహించాడు. శంబాల ఎలా ఉంది? ఆదికి హిట్టు దక్కిందా? లేదా? అంటే?
శంబాల మిస్టరీ....
శంబాల అనే చిన్న పల్లెటూరిలో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడినప్పటి నుంచి ఊరిలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆ ఊరి ప్రజలు ఒకరి తర్వాత మరొకరు పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తుంటారు. అంతుచిక్కని రీతిలో మరణిస్తుంటారు. ఊరిలో పడిన ఉల్క కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని స్వామిజీ చెప్పడంతో ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ ఉల్కను బండభూతం అని పిలవడం మొదలుపెడతారు. ఆ ఉల్క గురించి పరిశోధన చేయడానికి విక్రమ్ (ఆది సాయికుమార్) అనే సైంటిస్ట్ వస్తాడు. దేవుడిపై విక్రమ్‌కు నమ్మకం ఉండదు. సైన్స్‌ను నమ్ముతుంటాడు. ఊరి ప్రజల భయాన్ని మూఢనమ్మకంగా కొట్టిపడేస్తాడు విక్రమ్. అతడి పరిశోధనలో ఆ బండభూతం గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఆ ఊరిని ఆవహించిన భూతం కథేమిటి? ఆ భూతం మిస్టరీని ఛేదించడంలో విక్రమ్‌కు అండగా నిలిచిన దేవి (అర్చనా అయ్యర్) ఎవరు? శివుడు, అంధకాసురుడికి మధ్య జరిగిన యుద్ధానికి ఆ ఊరికి ఉన్న సంబంధమేమిటి? అన్నదే శంబాల కథ.
మైథాలజీ ట్రెండ్...
ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథాలజీ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ఎలిమెంట్‌ను థ్రిల్లర్ అంశాలతో చెబుతూ కొందరు హీరోలు, దర్శకులు విజయాలను అందుకుంటున్నారు. శంబాలతో హీరో ఆది, డైరెక్టర్ యుగంధర్ ముని అదే ప్రయత్నం చేశారు. సైన్స్‌కు దేవుడికి మధ్య సంఘర్షణకు ఓ పౌరాణిక గాథను, హారర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ శంబాల కథను రాసుకున్నారు డైరెక్టర్ తాను అనుకున్న పాయింట్‌ను చివరి వరకు ఎంగేజింగ్‌గా చెప్పడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
శివుడు, అంధకాసురుడికి మధ్య యుద్ధంతో ఈ సినిమా మొదలవుతుంది. ఉల్క ఆకాశం నుంచి శంబాల ఊళ్లో పడటం... ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆరంభ సన్నివేశాలతోనే ఆడియెన్స్‌ను శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. విక్రమ్ ఆ ఊరిలోకి అడుగుపెట్టడం, దేవి పరిచయమయ్యే సీన్లు...మరోవైపు ఊళ్లో అనూహ్య మరణాలతో ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించారు డైరెక్టర్. సైన్స్‌కు అందని శక్తి ఏదో శంబాలలో ఉందని ఇంటర్వెల్ ముందు విక్రమ్ కనిపెట్టే సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి క్రియేట్ చేశారు. మనషిలోని అరిషడ్వర్గాలను అడ్డుపెట్టుకొని ఆ భూతం ఎలా ఒకరి నుంచి మరొకరిలోకి ఎలా ప్రవేశిస్తుందనే సన్నివేశాలతో ద్వితీయార్థంలో భయపెట్టారు. ఆ హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. చివరకు ఆ ఊరి దేవత సహాయంతో ఆ దుష్టాత్మ బారి నుంచి విక్రమ్ ఊరి ప్రజలను ఎలా కాపాడాడు అన్నదానికి ఓ చిన్నారి పాత్రతో ఎమోషనల్ టచ్ ఇచ్చి సినిమాను ఎండ్ చేయడం ఆకట్టుకుంటుంది.
లాజిక్ మిస్...
కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా డీటెయిలింగ్‌గా చెప్పడంతో కొన్ని చోట్ల కథ సాగదీసిన అనుభూతి కలుగుతుంది. దుష్టాత్మ కారణంగా ఊరి ప్రజలు విచిత్రంగా మారే సీన్లు రిపీటెడ్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. చివరకు ఆ భూతం పీడ వదిలించే సీన్లలో లాజిక్ కనిపించదు. వాటిని కొత్తగా రాసుకుంటే బాగుండేది.
చాలా రోజుల తర్వాత...
విక్రమ్ పాత్రలో ఆది నటన బాగుంది. చాలా రోజుల తర్వాత అతడిలోని నటుడికి ఛాలెంజ్ విసిరే క్యారెక్టర్ దొరికింది. రెగ్యులర్ కమర్షియల్ అంశాలేవి లేకుండా హీరో పాత్రకు దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ అర్చనా అయ్యర్ పాత్ర నిడివి తక్కువే. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అతి భయస్తుడైన కానిస్టేబుల్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌లో మధునందన్ అక్కడక్కడ నవ్వించాడు. రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్‌తో పాటు మిగిలిన వారి నటన, వారి క్యారెక్టర్లు పర్వాలేదనిపిస్తాయి. సాంకేతికంగా శ్రీచరణ్ పాకాల బీజీఎమ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథలోని ఫీల్‌ను బీజీఎమ్ ఎలివేట్ చేసింది. యుగంధర్ ముని డైరెక్టర్ కంటే రైటర్‌గానే ఎక్కువగా మెప్పించాడు. లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి కాన్సెప్ట్ తో సినిమాలు తీయచ్చని శంబాల నిరూపించింది.
శంబాల థ్రిల్లింగ్‌కు గురించి ఓ డిఫరెంట్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ . ఆది సాయికుమార్‌కు మంచి కమ్‌బ్యాక్‌గా ఈ మూవీ నిలిస్తుంది.
రేటింగ్ : 3/5
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



