Shalini Pandey | విలన్‌గా అర్జున్ రెడ్డి హీరోయిన్ – ఓటీటీలో రిలీజైన బాలీవుడ్ మూవీ
అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రాహు కేతు ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Mar 7, 2026, 5.26 pm IST
Shalini Pandey | టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ అన్‌లక్కీ హీరోయిన్ ఎవరంటే షాలినీ పాండే పేరు చెబుతుంటారు ఫ్యాన్స్. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ అర్జున్ రెడ్డి బ్యూటీ ఇటీవలే హిందీలో రాహు కేతు అనే సినిమా చేసింది. కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాన్సెప్ట్ బాగున్నా ఫన్ అంతగా వర్కవుట్ కాకపోవడంతో రాహు కేతు డిజాస్టర్‌గా నిలిచింది.
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి...
థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత రాహుకేతు మూవీ ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
రాహు కేతు మూవీలో పులకిత్ సామ్రాట్, వరుణ్ శర్మ హీరోలుగా నటించారు. విపుల్ విగ్ దర్శకత్వం వహించాడు. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో పది కోట్ల లోపే కలెక్షన్స్ దక్కించుకొని డిజాస్టర్‌గా నిలిచింది.
నెగెటివ్ క్యారెక్టర్‌లో...
రాహు కేతు మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో షాలినీ పాండే కనిపించింది. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే కన్నింగ్ మనస్థత్వంమున్న యువతిగా నటించింది.
పురాణాలకు నేటి సామాజిక పరిస్థితులను అన్వయిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. చురులాల్ అనే రైటర్ రాహు, కేతు అనే పాత్రలు సృష్టిస్తాడు. ఓ మ్యాజికల్ బుక్ వల్ల వారి పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. మీను అనే అమ్మాయి చేసిన ఓ తప్పు కారణంగా అనుకోకుండా వారు ఓ డ్రగ్ మాఫియా వలలో చిక్కుకుంటారు. ఆ గ్యాంగ్ మెంబర్స్ బారి నుంచి తమ ప్రాణాలను రాహు, కేతు ఎలా కాపాడుకున్నారు? మీను చేసిన తప్పేమిటి అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



