త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి హీరోయిన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ – తెలుగులో రిలీజ్‌

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లీడ్ రోల్‌లో న‌టించిన హిందీ వెబ్ సిరీస్‌ బ్యాండ్‌వాలే ఈ వార‌మే ఓటీటీ సంద‌డి చేయ‌బోతుంది. ఫిబ్ర‌వ‌రి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 10, 2026, 2.36 pm IST

Web Series | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి హీరోయిన్  రొమాంటిక్ వెబ్ సిరీస్ – తెలుగులో రిలీజ్‌
Advertisement

Web Series | విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ ల‌వ్‌స్టోరీలో షాలిని పాండే హీరోయిన్‌గా న‌టించింది. ప్రీతి పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకుంది. అర్జున్ రెడ్డి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ టాప్ హీరోగా, సందీప్ వంగా అగ్ర ద‌ర్శ‌కుడిగా మారిపోయారు. షాలిని పాండే కెరీర్‌కు మాత్రం ఈ సినిమా పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అర్జున్ రెడ్డి స‌క్సెస్ క్రెడిట్ ఆమెకు అంత‌గా ద‌క్క‌లేదు.

హిట్టు లేదు...

అర్జున్ రెడ్డి త‌ర్వాత తెలుగు, త‌మిళంతో పాటు బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసింది షాలిని పాండే. కానీ హిట్టు మాత్రం ద‌క్క‌లేదు. తాజాగా ఓ మ్యూజిక‌ల్ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్‌తో ఈ వార‌మే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది షాలిని పాండే.

బ్యాండ్‌వాలే...

బ్యాండ్‌వాలే పేరుతో రూపొందిన ఈ హిందీ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో షాలిని పాండేతో పాటు జ‌హాన్ క‌పూర్‌, స్వానంద్ కిర్‌కిరే కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.
అఫీషియ‌ల్‌గా బ్యాండ్‌వాలే వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో నోట్ బుక్‌తో క్యూట్ లుక్స్‌తో షాలిని పాండే క‌ట్టిప‌డేస్తుంది.
ఈ వెబ్ సిరీస్‌లో షాలిని పాండే మ‌రియ‌మ్ అనే ర‌చ‌యిత్రిగా క‌నిపించ‌బోతుంది. త‌న క‌విత‌లు, పాట‌లు స‌మాజం మెచ్చుకోవాల‌ని క‌ల‌లు కంటుంది మ‌రియ‌మ్‌. రోబో, డీజే సైకో ల‌తో ప‌రిచ‌యం మ‌రియ‌మ్ జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పింది. రైట‌ర్‌గా ఫేమ‌స్ కావాల‌నే మ‌రియ‌మ్ కల నెర‌వేరిందా? ఈ ముగ్గురు క‌లిసి లాంఛ్ చేసిన బ్యాండ్‌ట్రూప్ స‌క్సెస్ అయ్యిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఢిల్లీ బెల్లీ ఫేమ్‌...

మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో బ్యాడ్‌వాలే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను అంకుర్ తివారీతో క‌లిసి ఢిల్లీ బెల్లీ మూవీ ఫేమ్ అక్ష‌త్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్యాండ్‌వాలేలో కీల‌క పాత్ర‌ను పోషించిన స్వానంద్ కిర్‌కిర్ ఈ సిరీస్‌కు క‌థ‌ను అందించారు. ఈ వెబ్‌సిరీస్ హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement