Richest Heroes | ఇండియాలోనే రిచెస్ట్ హీరోలు వీళ్లే – సెకండ్ ప్లేస్‌లో నాగార్జున – లిస్ట్‌లో చిరు, వెంకీ, చరణ్
ఇండియాలోనే టాప్ టెన్ రిచెస్ట్ హీరోల లిస్ట్‌లో నలుగురు తెలుగు హీరోలు ఉన్నారు. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ టాప్ ప్లేస్‌ను దక్కించుకోగా తెలుగు హీరో నాగార్జున రెండో స్థానంలో ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్‌తో పాటు రామ్‌చరణ్ వేల కోట్ల ఆస్తులతో రిచెస్ట్ హీరోల లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నారు.
Entertainment | Published On Jan 22, 2026, 11.02 am IST
Richest Heroes | ఒకప్పుడు ఓ హీరో కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటే గొప్పగా చెప్పేవారు. కానీ పాన్ ఇండియన్ కల్చర్‌తో ఇప్పుడు ఒక్కో స్టార్ హీరో వందల కోట్లలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. సినిమాల బడ్జెట్‌లో సగానికిపైగా హీరోల రెమ్యూనరేషన్ల కోసమే ఖర్చుచేయాల్సివస్తోంది. రెమ్యూనరేషన్లతో పాటు యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, బిజినెస్‌లు ఇలా...హీరోలు సంపాదన భారీగా పెరిగింది. బిజినెస్‌మెన్లకు ధీటుగా ప్రతి ఏటా హీరోల ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి.
టాప్ ప్లేస్‌లో షారుఖ్...
ఇండియాలోనే టాప్ టెన్ రిచెస్ట్ హీరోల లిస్ట్‌ను ఓ వార్త సంస్థ ప్రకటించింది. ఇందులో తెలుగు నుంచి నలుగురు హీరోలు ఉండటం గమనార్హం. రిచెస్ట్ హీరోల లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. షారుఖ్‌ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 12931 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. షారుఖ్‌ఖాన్ ఒక్కో సినిమా కోసం 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సొంతంగా ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోతో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు.
నాగార్జున మొత్తం ఆస్తులు ఎంతంటే?
రిచెస్ట్ హీరోల జాబితాలో టాలీవుడ్ హీరో నాగార్జున రెండో స్థానంలో నిలిచాడు. నాగార్జున ఆస్తుల విలువ 5000 కోట్లకుపైనే ఉంటుందట. హీరోగా నాగార్జున రెమ్యూనరేషన్ తీసుకునేది తక్కువే. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఇతర బిజినెస్‌ల ద్వారా నాగార్జున భారీగానే సంపాదిస్తోన్నట్లు సమాచారం.
అత్యధిక ఆస్తుల ఉన్న హీరోల లిస్ట్‌లోబాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ (3225 కోట్లు), హృతిక్ రోషన్ (3100 కోట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత 2250 కోట్లతో అక్షయ్‌కుమార్ ఐదో ప్లేస్‌లో నిలవగా...1860 కోట్లతో ఆమిర్‌ఖాన్ ఆరో స్థానంలో కొనసాగతోన్నాడు.
చిరంజీవి, వెంకటేష్...
ఇండియన్ టాప్ టెన్ రిచెస్ట్ హీరోల లిస్ట్‌లో నాగార్జునతో పాటు చిరంజీవి, వెంకటేష్ , రామ్‌చరణ్ కూడా స్థానం దక్కించుకున్నారు. 1750 కోట్లతో చిరంజీవి ఈ జాబితాలో ఏడో ప్లేస్‌లో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ (1680 కోట్లతో ఎనిమిదో ప్లేస్) కంటే చిరంజీవి ఆస్తుల విలువ ఎక్కువ కావడం గమనార్హం. 1650 కోట్లతో వెంకటేష్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. పదో ప్లేస్ కూడా టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌దే కావడం విశేషం. 1630 కోట్లతో ఈ జాబితాలో చివరి ప్లేస్‌లో నిలిచారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



