త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shah Rukh Khan | హంతకుడా…ప్రేమికుడా..? – కింగ్ పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌పై స్టైలిష్‌ పోస్ట‌ర్‌తో షారుఖ్ క్లారిటీ

కింగ్ సినిమా పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు షారుఖ్‌ఖాన్ వెరైటీగా చెక్ పెట్టారు. కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో నోటిలో గులాబీ పువ్వు, చేతిలో గ‌న్‌తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో షారుఖ్‌ఖాన్ క‌నిపిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న కింగ్‌ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు.

N

Entertainment | Published On Oct 27, 2026, 3.37 pm IST

Shah Rukh Khan | హంతకుడా…ప్రేమికుడా..? – కింగ్ పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌పై స్టైలిష్‌ పోస్ట‌ర్‌తో షారుఖ్ క్లారిటీ
Advertisement

Shah Rukh Khan |  షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) కింగ్ మూవీ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కావాల్సిన ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌కు త‌న‌దైన స్టైల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ చెక్ పెట్టారు. ఓ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో పెదాల మ‌ధ్య గులాబీ పువ్వు, చేతిలో రివాల్వ‌ర్ ప‌ట్టుకొని షారుఖ్‌ఖాన్ క‌నిపిస్తోన్నారు. అత‌డి వెన‌కాల మంట‌ల్లో కాలిపోతున్న ఓ విమానం క‌నిపిస్తోంది.

హంత‌కుడిని కాదు...

ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. హంత‌కుడిని కాదు ప్రేమికుడిని అంటూ ఈ పోస్ట‌ర్‌కు ఇచ్చిన క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. డిసెంబ‌ర్ 24నే కింగ్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు షారుఖ్‌ఖాన్ క్లారిటీ ఇచ్చారు . పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌ను ఖండించారు.

సుహానా ఖాన్‌...

కింగ్ మూవీలో షారుఖ్‌ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. తండ్రీకూతుళ్లు క‌లిసి న‌టిస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. దీపికా ప‌డుకోణ్ (Deepika Padukone) హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అభిషేక్‌బ‌చ్చ‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అనిల్ క‌పూర్‌, రాణి ముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రీనా క‌పూర్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది.

అనిరుధ్ బీజీఎమ్‌...

సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు షారుఖ్‌ఖాన్ స‌తీమ‌ణి గౌరీ ఖాన్ ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ బీజీఎమ్ స‌మ‌కూర్చుతున్నారు.

ధురంధ‌ర్ 2 కాపీ...

కాగా కింగ్ కొత్త పోస్ట‌ర్‌ను ధురంధ‌ర్ 2తో కంపేర్ చేస్తూ కొంద‌రు నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతోన్నారు. ధురంధ‌ర్ 2 కాపీ కొట్టి ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారంటూ కామెంట్లు పెడుతోన్నారు.

 

Advertisement
Advertisement