త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | రేవంత్‌! టెక్నాల‌జీ వాడు.. జవహర్‌నగర్ డంప్‌యార్డును తీసెయ్‌

Etala Rajendar | సీఎం రేవంత్‌రెడ్డి టైం తీసుకొని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డు (Jawaharnagar Dump Yard)ను తొల‌గించాల‌ని.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారమ‌య్యే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajendar) అన్నారు.

S

Telangana | Published On Oct 27, 2026, 3.13 pm IST

Etala Rajendar | రేవంత్‌! టెక్నాల‌జీ వాడు.. జవహర్‌నగర్ డంప్‌యార్డును తీసెయ్‌
Advertisement
  • ఒక్క కేజీ కూడా వ్య‌ర్థాలు లేకుండా చేయొచ్చు
  • పొడి చెత్త నుంచి క‌రెంటు త‌యారు చేయొచ్చు
  • 3 వేల కోట్లు పెట్టి ఈ డంప్‌యార్డును జీరో చేయండి
  • బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌

Etala Rajendar | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి టైం తీసుకొని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డు (Jawaharnagar Dump Yard)ను తొల‌గించాల‌ని.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారమ‌య్యే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajendar) అన్నారు. ఇప్పుడున్న టెక్నాల‌జీని వాడుకొని ఒక్క కేజీ కూడా వ్య‌ర్థాలు లేకుండా చేయొచ్చ‌న్నారు. ప్లాస్టిక్‌తో డాంబ‌ర్ త‌యారు చేసేలా చూడాల‌ని సూచించారు. పొడి చెత్త నుంచి క‌రెంటును కూడా ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం ఏదులాబాద్ నుంచి ప్రారంభ‌మైన‌ తొలి రోజు పాద‌యాత్ర అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ పాదయాత్రకు ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు హాజ‌ర‌య్యార‌ని.. ఆయ‌న‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. నాలుగు రోజుల పాటు సాగే పాద‌యాత్ర‌లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరూ భాగ‌మ‌వుతార‌ని వెల్ల‌డించారు.

ప‌రిష్కారం అయిత‌ద‌నుకున్నా.. కానీ

గ‌త 12 ఏళ్లుగా జవహ‌ర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు. నిబంధనలు పాటించాలని డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లక్ష రూపాయల ఫైన్ కూడా వేసింది. నాకంటే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. కొట్లాడే బిడ్డకు ఓటు వేయాలని ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని చెప్పి ఇక్కడి ప్రజలు గెలిపించారు. ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్జీటీలో, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ప్రశ్నించే గొంతు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని భావించాను.. కానీ రెండేళ్లయిన ఎలాంటి స్పందన లేదు.

జవహర్ నగర్ కమిటీ గురించి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉండి కూడా జవహ‌ర్ నగర్ డంప్‌యార్డు గురించి పార్లమెంటులో ప్రశ్నించాను. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ని కలిసి పరిష్కారం చూపించాలని కోరాను. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ఉందని నమ్మే ప్రధానమంత్రి కాబట్టి.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనే మోదీ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. రాష్ట్రం, కేంద్రం కలిసిమెలిసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంకల్పం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఫ్లై ఓవర్లకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోదీయే.

ఆ న‌మ్మ‌కంతో అడుగుతున్నా

ఆ నమ్మకంతో ముఖ్యమంత్రిని ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను. ప్రధాని ప్రజల సేవకులుగా పనిచేస్తారు. సంకుచిత స్వభావం లేదు.. కాబట్టి 2, 3 వేల కోట్ల రూపాయలు పెడితే జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రజల బ‌తుకులు మారుతాయి. కోట్ల టన్నుల చెత్త పోయే అవకాశం ఉంది. దానికి డీపీఆర్ తయారు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్‌తో డాంబర్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది.. ఉపయోగించుకోండి. తడి చెత్త నుంచి పంట పొలాలకు అవసరమైన ఆర్గానిక్ మ్యానూర్ తయారు చేయవచ్చు. ఒక్క కిలో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను తిరిగి వినియోగించే టెక్నాలజీ ఉంది కాబట్టి 3000 కోట్ల రూపాయల ఖర్చుపెట్టి జవహర్ నగర్ డంప్‌ను జీరో చేయించండి.

ఈరోజే సుశీల అనే మ‌హిళ చ‌నిపోయింది

చెరువును నమ్ముకుని బ‌తుకుతున్న మత్స్యకారుల బ‌తుకులు రోడ్డున పడ్డాయి. ఆ నీళ్లు తాగిన గొర్రెలు, మేకలు చచ్చిపోయాయి. పశువులకు అబార్షన్లలవుతున్నాయి. మనుషులకు అబార్షన్లు అవుతున్నాయి. ఈరోజే ఈ గ్రామంలో సుశీల అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. మొన్నే 25 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో చనిపోయారు. ఎదులాబాద్ లోనే పదుల సంఖ్యలో క్యాన్సర్ తో చనిపోయారు. వందల మందికి క్రానిక్ రెస్పిరేటరీ డిసీస్ వచ్చాయి. ఈ నీళ్లతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి. నీళ్లు, పంట, పాడి, మత్స్య సంపద ఏదీ లేకుండా పోయింది.

ఒకప్పుడు పచ్చని పొలాలతో ఉన్న ఎదులాబాద్.. ఇప్పుడు మృత్యుకుహరంగా మరణ మృదంగం మోగిస్తోంది. రేవంత్ రెడ్డి.. మీకు తీరిక లేనట్టుంది. జర ఈ ప్రజల బాధలను గురించి పట్టించుకోండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 4 రోజులపాటు ఈ పాదయాత్ర చేస్తున్నాం. చివరి రోజు బాలాజీ నగర్ లో పెద్ద సభ పెడుతున్నాం. మీ అందరి మద్దతు ఉంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కొనవచ్చు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మడమ తిప్పకుండా కొట్లాడాం. అదే స్ఫూర్తితో మీ ముందుకు వచ్చాం.

సమస్యలు సంపూర్ణంగా అర్థం అయ్యాయి. వాటి పరిష్కారం కోసం మేం ఈ పాదయాత్ర చేస్తున్నాం. కాబట్టి బాధితులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు అండగా ఉండటానికి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలకు అండగా ఉంటాను అని ఈట‌ల రాజేంద‌ర్ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement