Deepika Padukone | తల్లయిన నెల రోజులకే కెమెరా ముందుకు దీపికా పడుకోణ్ – షారుఖ్ ఖాన్ కింగ్‌తో రీఎంట్రీ
తల్లయిన నెలరోజుల్లోనే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది దీపికా పడుకోణ్. ఈ వారంలోనే షారుఖ్‌ఖాన్ కింగ్ షూటింగ్‌లో పాల్గొనబోతుంది. సినిమాల పట్ల దీపికా డెడికేషన్‌పై ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తోన్నాయి.
Entertainment | Published On Oct 23, 2026, 2.59 pm IST
Deepika Padukone | గత నెలలో మాతృత్వ బంధంలోకి అడుగుపెట్టింది దీపికా పడుకోణ్. రెండోసారి రణవీర్, దీపికా దంపతులకు కూతురు పుట్టింది. చిన్నారికి దేవీ పడుకోణ్ సింగ్ అనే పేరు పెట్టినట్లు దసరా సందర్భంగా ఈ బాలీవుడ్ జోడీ ప్రకటించారు. తల్లిగా మారడంతో దీపికా పడుకోణ్ సినిమాలకు ఐదారు నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ బాలీవుడ్ బ్యూటీ తిరిగి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ రూమర్లకు తెరదించుతూ నెల రోజుల్లోనే తిరిగి కెమెరా ముందుకు రాబోతుంది దీపికా పడుకోణ్. బాలీవుడ్ మూవీ కింగ్ షూటింగ్‌లో జాయిన్ అవుతోంది.
షారుఖ్ ఖాన్ కూతురు...
షారుఖ్‌ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న కింగ్ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ స్టైలిష్ యాక్షన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
సాంగ్ షూటింగ్...
ఓ పాట మినహా కింగ్ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఆగస్ట్‌లోనే ఈ సాంగ్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ దీపికాతో పాటు ఇతర నటీనటుల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వాయిదాపడింది. తాజాగా అక్టోబర్ 26 నుంచి ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూట్ మొదలుకాబోతుంది. దీపికా పడుకోణ్ కోసమే సౌతాఫ్రికాలో అనుకున్న లోకేషన్‌కు ముంబైకి మార్చినట్లు సమాచారం.
నెల రోజుల్లోనే...
ఈ పాట చిత్రీకరణలో షారుఖ్‌ఖాన్, దీపికా పడుకోణ్‌తో పాటు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అభయ్ వర్మ కనిపించబోతున్నట్లు సమాచారం. వైభవ్ మర్చెంట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. కాగా తల్లిగా మారిన నెలరోజుల్లోనే దీపికా పడుకోణ్ తిరిగి షూటింగ్‌లలో పాల్గొననుండటంపై బాలీవుడ్ వర్గాలతో పాటు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావానికి నిదర్శనమిదని అంటున్నారు.
దీపికా పడుకోణ్, షారుఖ్‌ఖాన్ కాంబినేషన్‌లో వస్తోన్న ఆరో మూవీ ఇది. షారుఖ్‌ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiara Advani | భర్త సినిమాలో హీరోయిన్‌గా కియారా – బాలీవుడ్ నటి బయోపిక్‌పై రూమర్లు
అక్టోబర్ 22, 2026

Ramayana | రామాయణపై మరో ట్విస్ట్ – ఓటీటీలో డబ్బులు పెట్టి చూడాల్సిందే – బడ్జెట్ కష్టాలే కారణమా?
అక్టోబర్ 22, 2026

Rashmika Mandanna | జాన్వీకపూర్ పెద్ది వివాదంపై రష్మిక రియాక్షన్ – “నో” చెప్పడం తప్పుకాదన్న విజయ్ దేవరకొండ
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి
- ●MP Mallu Ravi | బీజేపీవి దృష్టి మళ్లింపు రాజకీయాలు: ఎంపీ మల్లు రవి
- ●TGSPF | తెలంగాణ ప్రగతికి టీజీఎస్పీఎఫ్ రక్షణ కవచం
- ●PM Modi | విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు
- ●Ration Rice | తెలంగాణలో 42 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం
- ●Rukmini Vasanth | హిట్టు కోసం జానర్ మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్ - లేడీ ఓరియెంటెడ్ కథలో..

CS Sanjay Jaju | ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్య పర్చాలి

MP Mallu Ravi | బీజేపీవి దృష్టి మళ్లింపు రాజకీయాలు: ఎంపీ మల్లు రవి

TGSPF | తెలంగాణ ప్రగతికి టీజీఎస్పీఎఫ్ రక్షణ కవచం

PM Modi | విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు



