Agriculture Dept | వరి విత్తనాల విక్రయానికి సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి కాదు
Agriculture Dept | వరి విత్తనాల విక్రయానికి 'సెల్ఫ్ డిక్లరేషన్' తప్పనిసరి అంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. "వరి సాగు.. బాధ్యత నాదే!" శీర్షికతో ఈ నెల 27న సాక్షి దినపత్రిక (తెలంగాణ మెయిన్, 3, 7 పేజీలు)లో ప్రచురితమైన వార్త వాస్తవాలకు విరుద్ధంగా, రైతులను అయోమయానికి గురిచేసేలా ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ గోపీ ప్రకటించారు.
ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్న వ్యవసాయ శాఖ
Agriculture Dept | త్రినేత్ర న్యూస్ : వరి విత్తనాల విక్రయానికి 'సెల్ఫ్ డిక్లరేషన్' తప్పనిసరి అంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. "వరి సాగు.. బాధ్యత నాదే!" శీర్షికతో ఈ నెల 27న సాక్షి దినపత్రిక (తెలంగాణ మెయిన్, 3, 7 పేజీలు)లో ప్రచురితమైన వార్త వాస్తవాలకు విరుద్ధంగా, రైతులను అయోమయానికి గురిచేసేలా ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ గోపీ ప్రకటించారు.
రైతుల నుంచి 'స్వయం అంగీకార పత్రం' (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకున్న తర్వాతే వరి విత్తనాలు విక్రయించాలని విత్తన డీలర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలో పేర్కొనడం పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి ఉత్తర్వులు గానీ, సూచనలు గానీ శాఖ జారీ చేయలేదని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, యాసంగిలో నీటి లభ్యత, భూగర్భ జలమట్టాలు, విద్యుత్ డిమాండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు తక్కువ నీటితో, స్వల్ప కాల పరిమితి గల, పండే ప్రత్యామ్నాయ పంటలను పండించాలని రైతులను కోరుతున్నామని చెప్పారు.
రైతులకు అవసరమైన అన్ని రకాల పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయ పంటల విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డీలర్లు సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఒత్తిడి చేసినా, నాణ్యత లేని విత్తనాలు విక్రయించినా సంబంధిత మండల/జిల్లా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అటువంటి డీలర్లపై విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు అధికారికంగా వెలువడే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, తప్పుదోవ పట్టించే వార్తలను నమ్మవద్దని డాక్టర్ బీ గోపీ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●E20 fuel | పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచన లేదు : కేంద్ర మంత్రి
- ●Etala Rajendar | రేవంత్! టెక్నాలజీ వాడు.. జవహర్నగర్ డంప్యార్డును తీసెయ్
- ●Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - టైటిల్ ఇదే - ఫస్ట్ గెస్ట్లు ఎవరంటే?
- ●Dhanteras 2026 | ధంతేరస్ వేళ బంగారం, వెండి ధరల్లో భారీ తేడా.. దేనిపై పెట్టుబడి మంచిది?
- ●Supreme Court | ఫారం-6లో మార్పులపై పిటిషన్.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
- ●Errolla Srinivas | 9,102 అట్రాసిటీ కేసులైతే.. 32 కేసుల్లోనే శిక్షలా?

E20 fuel | పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచన లేదు : కేంద్ర మంత్రి

Etala Rajendar | రేవంత్! టెక్నాలజీ వాడు.. జవహర్నగర్ డంప్యార్డును తీసెయ్

Chiranjeevi | ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - టైటిల్ ఇదే - ఫస్ట్ గెస్ట్లు ఎవరంటే?

Dhanteras 2026 | ధంతేరస్ వేళ బంగారం, వెండి ధరల్లో భారీ తేడా.. దేనిపై పెట్టుబడి మంచిది?





