త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seerat Kapoor | షూటింగ్ పూర్త‌యినా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదు – టాలీవుడ్ హీరోయిన్ ఆరోప‌ణ‌లు

రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఓ నిర్మాణ సంస్థ ఆల‌స్యం చేస్తోందంటూ టాలీవుడ్ హీరోయిన్ సీర‌త్ క‌పూర్ ట్వీట్ చేసింది. స‌ద‌రు నిర్మాణ సంస్థ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యింద‌ని అన్న‌ది. ఓ తెలుగు ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను ఉద్దేశించే సీర‌త్ క‌పూర్ ట్వీట్ చేసింద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Mar 8, 2026, 1.14 pm IST

Seerat Kapoor | షూటింగ్ పూర్త‌యినా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌లేదు – టాలీవుడ్ హీరోయిన్ ఆరోప‌ణ‌లు
Advertisement

Seerat Kapoor |  ఓ నిర్మాణ సంస్థ త‌న‌కు ఇవ్వాల్సిన రెమ్యూన‌రేష‌న్ చెల్లించ‌కుండా ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ని టాలీవుడ్ హీరోయిన్ సీర‌త్ క‌పూర్ ఆరోపించింది. వారు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యిందంటూ ట్వీట్ చేసింది. ర‌న్ రాజా ర‌న్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ముంబై బ్యూటీ సీర‌త్ క‌పూర్‌. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ మూవీ హిట్ట‌వ్వ‌డంతో తెలుగులో చాలానే అవ‌కాశాలు అందుకుంది. రాజుగారి గ‌ది 2, టైగ‌ర్‌, ఒక్క క్ష‌ణంతో పాటు ప‌లు సినిమాలు చేసింది. అయినా ఆశించిన స్థాయిలో సీర‌త్‌క‌పూర్‌కు గుర్తింపు మాత్రం రాలేదు. రెండేళ్ల క్రితం రిలీజైన మ‌న‌మే మూవీతో చివ‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత మ‌రో ఛాన్స్ సీర‌త్‌కు ద‌క్క‌లేదు. టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది.

రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డం లేదు...

తాజాగా రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఓ నిర్మాణ సంస్థ ఇబ్బందులు పెడుతోంద‌ని సీర‌త్ క‌పూర్ ఓ ట్వీట్ చేసింది. షూటింగ్ పూర్త‌యి చాలా రోజులు అయినా త‌న‌కు ఇవ్వాల్సిన రెమ్యూన‌రేష‌న్‌ను స‌ద‌రు నిర్మాణ సంస్థ ఇప్ప‌టికీ చెల్లించ‌లేద‌ని చెప్పింది. "సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌ట‌న మాత్ర‌మే కాకుండా వృత్తిప‌ర‌మైన నిజాయితీ, న‌మ్మ‌కం చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. కానీ కొంద‌రు మాత్రం త‌మ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. సినిమా షూటింగ్ పూర్త‌యినా ఓ నిర్మాణ సంస్థ రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌కుండా ఆల‌స్యం చేస్తోంది. వారు ఇచ్చిన గ‌డువు దాటిపోయింది. మా ఇంట్లో వాళ్ల‌కు ఆరోగ్యం బాగాలేద‌ని, మెడ‌కిల్ ఎమ‌ర్జెన్సీ అని చెప్పిన కూడా వారు స్పందించ‌లేదు. మా స్టాఫ్‌ పేమెంట్స్ ఆపేశారు. వారికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యింది. అయినా నేను ఇన్నాళ్లు స‌హ‌నంతో ఉన్నా. ఇక ఓపిక ప‌ట్టేది లేదు" అని చెప్పింది.

చ‌ట్ట‌ప్ర‌కార‌మే తేల్చుకుంటా...

సాధ్య‌మైనంత‌కు త్వ‌ర‌గా రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌ని ప‌క్షంలో చ‌ట్ట‌ప్ర‌కారం కోర్టులోనే స‌ద‌రు నిర్మాణ సంస్థ‌తో తేల్చుకుంటాన‌ని చెప్పింది. ప‌రిస్థితి ఒక్క‌డి వ‌ర‌కు రాక‌ముందే త‌న రెమ్యూన‌రేష‌న్ చెల్లిస్తే బాగుంటుంద‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు వార్నింగ్ ఇచ్చింది. సీర‌త్ క‌పూర్‌ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ లాంటి టాప్ హీరోల‌తో సినిమాలు నిర్మించిన ఓ తెలుగు ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ పెట్టిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement