Thalapathy Vijay | ఆ దర్శకుడి అన్ని సినిమాల్లో హీరో పేరు విజయ్ – ఎవరా డైరెక్టర్ ? తమిళనాడు సీఎంతో లింకేంటి?
ఓ తమిళ దర్శకుడు తాను రూపొందించిన అన్ని సినిమాల్లో హీరోల పేర్లు విజయ్ అనే పెట్టారు. తమిళంలోనే కాదు తెలుగులో చిరంజీవితో సినిమాలు చేసినా విజయ్ పేరు మాత్రం మార్చలేదు. విజయ్ కాంత్, చిరంజీవి, శరత్‌కుమార్ హీరోలు ఎవరైనా తన సినిమాలో క్యారెక్టర్ పేరు మాత్రం విజయ్ అని ఉండాల్సిందే. ఎవరా డైరెక్టర్ అంటే?
Entertainment | Published On Jun 16, 2026, 7.48 pm IST
Thalapathy Vijay | తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Thalapathy Vijay) తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగారు. తెలుగు ప్రేక్షకులకు కూడా దర్శకుడిగా ఆయన సుపరిచితుడే. తెలుగులో చిరంజీవి హీరోగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు, పల్లెటూరి మొనగాడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దళపతి విజయ్ కోలీవుడ్ టాప్ హీరోగా పేరుతెచ్చుకోవడంలో తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కీలకంగా నిలిచారు. కొడుకునే హీరోగా పరిచయం చేయడమే కాకుండా అతడితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించాడు.
సెంటిమెంట్....
కాగా దర్శకుడిగా ఎస్ఏ చంద్రశేఖర్‌కు చాలా కాలం పాటు ఓ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో హీరో పేరు విజయ్‌గానే చూపించేవారు. తెలుగు(Tollywood), తమిళం, కన్నడ భాష మారిన హీరో పేరు మాత్రం విజయ్‌గానే కొనసాగించారు. చిరంజీవి(Chiranjeevi), విజయ్‌కాంత్...ఇలా హీరోలు మారినా పేరు మాత్రం మార్చేవారు కాదు. తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలో కొడుకు పేరునే హీరోలకు పెట్టేవారు. వారిలో తన కొడుకునే చూసుకునేవారు.
చిరంజీవి పేరు....
ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన దేవాంతకుడు, చట్టానికి కళ్లు లేవు సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ల పేరు విజయ్ కావడం గమనార్హం. విజయ్ పేరు సెంటిమెంట్‌ను చాలా కాలం పాటు కొనసాగించాడు.
ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా తమిళంలో చాలా సినిమాలు చేశారు. విజయ్ హీరోగా నటించిన పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా కూడా వ్యవహరించారు. విజయ్ తండ్రి మాత్రమే కాకుండా తల్లి శోభా కూడా చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





