Thalapathy Vijay Father | చిరంజీవి హీరో – దళపతి విజయ్ తండ్రి డైరెక్టర్ – తెలుగులో వచ్చిన సూపర్ సూపర్ హిట్ సినిమాలు ఇవే
దళపతి విజయ్ టాప్ హీరోగా ఎదగడటంతో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పాత్ర చాలా ఉంది. దళపతి విజయ్ హీరోగా నటించిన పలు తమిళ సినిమాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. తమిళంలోనే కాకుండా తెలుగులో చిరంజీవితో చంద్రశేఖర్ కొన్ని సినిమాలు చేశారు.
Entertainment | Published On Jan 17, 2026, 8.37 pm IST
Thalapathy Vijay Father | కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ సినిమాలకు అఫీషియల్‌గా గుడ్‌బై చెప్పేశారు. జననాయగన్ తన చివరి మూవీ అంటూ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు స్వయంగా ప్రకటించారు. విజయ్ లాస్ట్ మూవీ జననాయగన్ కోసం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూశారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన జననాయగన్ సెన్సార్ సమస్యలు ఎదుర్కోవడం తమిళనాట ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు.
220 కోట్ల రెమ్యూనరేషన్...
జననాయగన్ కోసం దళపతి విజయ్ 220 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. తమిళంలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఈ మూవీతో దళపతి విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. తొలి సినిమాకు విజయ్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఆ స్థాయి నుంచి టాప్ హీరోగా ఎదిగారు.
తండ్రి దర్శకత్వంలో...
దళపతి విజయ్ అగ్ర హీరోగా ఎదగడంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్ర శేఖర్ పాత్ర చాలా మంది. కెరీర్ ఆరంభంలో విజయ్‌తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదట. దాంతో విజయ్‌ని హీరోగా పెట్టి చంద్రశేఖర్ చాలా సినిమాలు నిర్మించారు. ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన నాలైయతీర్పు మూవీతోనే హీరోగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా కొడుకు విజయ్‌తో పది సినిమాలు చేశారు చంద్రశేఖర్ . అంతే కాకుండా కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించారు. విజయ్‌తోనే కాకుండా విజయ్ కాంత్, రజనీకాంత్, కమల్‌హాసన్, అంబరీష్ వంటి స్టార్ హీరోలతో చంద్రశేఖర్ సినిమాలు చేశారు.
చిరంజీవి హీరోగా...
తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా చంద్రశేఖర్ సుపరిచితులే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో మూడు సినిమాలు చేశాడు. చిరంజీవి, ఎస్ఏ చంద్రశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన చట్టానికి కళ్లులేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాలు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఇవే కాకుండా బలిదానం, దోపిడి దొంగలు, ఇంటికో రుద్రమ్మతో పాటు మరికొన్ని సినిమాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తమిళంలో బిజీ కావడంతో తెలుగు సినిమాలకు చంద్రశేఖర్ దూరమయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!
- ●AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!
- ●Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!
- ●Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
- ●KTR Delhi visit | ఢిల్లీలో కేటీఆర్.. తెలంగాణ బిడ్డ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి
- ●DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..

TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

Telangana Journalists Housing | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ షురూ: ఫేక్ పేర్లకు చెక్ పెడుతూ మీడియా అకాడమీ అర్జెంట్ ఆదేశాలు!

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?






