Ashu Reddy | అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ ఇదే – రియల్ కాదు…రీల్ లైఫ్‌లో…
అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ ఫొటోల వెనకున్న ట్విస్ట్ రివీలైంది. ఈ ఎంగేజ్‌మెంట్ రియల్‌గా జరిగింది కాదట. ఓ వెబ్‌సిరీస్ షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ ఫొటోలను శుక్రవారం ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు సమాచారం.
Entertainment | Published On May 9, 2026, 3.43 pm IST
Ashu Reddy | పెళ్లి పేరుతో ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తమ నుంచి అషురెడ్డి తొమ్మిదిన్నర కోట్ల వరకు వసూలు చేసిందని ఆ ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ చీటింగ్ కేసు విచారణలో ఉండగానే అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తన ఎంగేజ్‌మెంట్ వేడుకల తాలూకు ఫొటోలను ఈ బిగ్‌బాస్ బ్యూటీ స్వయంగా అభిమానులతో పంచుకుంది.
కాబోయే భర్త ఎవరు?
ఓ ఫొటోలో లంగా వోణీలో తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూస్తూ మురిసిపోతూ అషురెడ్డి కనిపించింది. కాబోయే భర్త చేతిని పట్టుకొని దిగిన మరో ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమెకు కాబోయే భర్త ఎవరు? అతడి వివరాలను ఎందుకు వెల్లడించలేదు? కేసు విచారణలో ఉండగానే ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ తెగ డిస్కషన్స్ నడిచాయి.
వెబ్ సిరీస్...
అయితే ఈ ఎంగేజ్‌మెంట్ రియల్‌గా జరిగింది కాదు. రీల్ లైఫ్ ఎంగేజ్‌మెంట్. ప్రస్తుతం అషురెడ్డి జియో హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో భాగంగా అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ సీన్లను ఇటీవల మేకర్స్ షూట్ చేశారు. ఆ వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అషురెడ్డి. ఈ ఫొటోలను చూసి చాలా మంది రియల్‌గానే అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ జరిగిందని పొరపడ్డారు.
విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఫొటోలు ఇవి.. బిగ్‌బాస్ తెలుగు విన్నర్ నిఖిల్ మలియక్కల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌లో అషురెడ్డి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సిరీస్ నిఖిల్, అషురెడ్డి ఎంగేజ్‌మెంట్ సీన్లను ఇటీవల మేకర్స్ చిత్రీకరించారు. ఆ విజువల్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అషురెడ్డి షేర్ చేసింది. ఈ ఫొటోల వెనకున్న ట్విస్ట్‌ను బయటపెట్టింది. కొన్నిసార్లు మన కళ్లతో చూసినవి, చెవులతో విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు. ఏదైనా ఓ విషయంపై నమ్మకానికి వచ్చే దాని వెనకున్న నిజానిజాలేమిటో ఆలోచిస్తే బాగుంటుంది. నా ఉద్దేశం అందరికి అర్థమై ఉంటుందని అనుకుంటున్నా అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది అషు. తనపై నమోదు అయిన చీటింగ్ కేసు గురించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పిటిషన్...
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషురెడ్డి మోసం చేసిందని ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ కేసు పెట్టారు. అతడిపై అషురెడ్డి కూడా నష్టపరిహారం దావా వేసింది. ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. కానీ అషురెడ్డి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhurandhar 2 | మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 – రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
మే 15, 2026

Ashu Reddy | ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అషురెడ్డి? – సడెన్ షాకిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫొటోలు వైరల్
మే 8, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



