త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rao Bahadur | య‌శ్ టాక్సిక్‌కు పోటీగా థియేట‌ర్ల‌లోకి స‌త్య‌దేవ్ రావు బ‌హ‌దూర్‌ – మ‌హేష్‌బాబు ప్ర‌జెంట‌ర్‌

మ‌హేష్ బాబు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న రావు బ‌హ‌దూర్ మూవీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా జూన్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. య‌శ్ టాక్సిక్‌కు పోటీగా విడుద‌ల కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Apr 26, 2026, 9.00 pm IST

Rao Bahadur | య‌శ్ టాక్సిక్‌కు పోటీగా థియేట‌ర్ల‌లోకి స‌త్య‌దేవ్ రావు బ‌హ‌దూర్‌ – మ‌హేష్‌బాబు ప్ర‌జెంట‌ర్‌
Advertisement

Rao Bahadur | ఓ చిన్న సినిమా కోసం సూపర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌జెంట‌ర్‌గా మారారు. స‌త్య‌దేవ్ హీరోగా వెంక‌టేష్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో రావు బ‌హ‌దూర్ పేరుతో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కింది. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఖ‌రారైంది. జూన్ 5న రావు బ‌హ‌దూర్ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పోస్ట‌ర్‌లో...

రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ లుక్‌లో క‌నిపించారు. సాంప్రదాయ దుస్తుల్లో అధికారం, రహస్యం కల‌గ‌లిసిన‌ట్లుగా ఆస‌క్తిక‌రంగా లుక్‌ను మేక‌ర్స్ డిజైన్ చేశారు. స‌త్య‌దేవ్ ధ‌రించిన త‌ల‌పాగాలో చిన్న పురుగు, తీగలతో కప్పబడ్డ భారీ కోట ఆస‌క్తిని పంచుతోన్నాయి.

సుంద‌రి...

రావు బ‌హ‌దూర్‌లో స‌త్య‌దేవ్‌కు జోడీగా దీపా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మెలోడీ సాంగ్‌లో వింటేజ్ స్టైల్‌లో సత్యదేవ్, దీప థామస్ కెమిస్ట్రీని ఆవిష్క‌రించారు.

యూనిక్ పాయింట్‌...

ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే స్టోరీ రైట‌ర్‌గా, ఎడిట‌ర్‌గా వెంకటేష్ మహా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అత‌డి గ‌త సినిమాల త‌ర‌హాలోనే ఎమోష‌న్స్‌తో పాటు యూనిక్ పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. రావు బ‌హ‌దూర్ సినిమాకు స్మ‌ర‌ణ్ సాయి మ్యూజిక్ అందించారు. ఇందులో వికాస్ ముప్పాల‌, బాల ప‌రాస‌ర్‌, ఆనంద్ భార‌తి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

టాక్సిక్‌తో పోటీ...

య‌శ్ టాక్సిక్‌కు పోటీగా చిన్న సినిమా రావుబ‌హ‌దూర్‌ థియేట‌ర్ల‌లోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అందులోనూ మ‌హేష్‌బాబు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సినిమా కావ‌డంతో అభిమానుల్లో క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. య‌శ్ టాక్సిక్ మూవీ జూన్ 4న రిలీజ్ అవుతోంది.

 

Advertisement
Advertisement