Satyadev | సమవర్తిగా సత్యదేవ్ – టాలీవుడ్‌కు కొత్త జానర్‌ను పరిచయం చేస్తోన్న హీరో
టాలీవుడ్ హీరో సత్యదేవ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సమవర్తి అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Entertainment | Published On May 22, 2026, 5.42 pm IST
Satyadev | కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోన్నాడు సత్యదేవ్. రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథ, పాత్రల పరంగా ప్రయోగాలు చేయడానికి వెనుకాడటం లేదు. వెరైటీ జానర్‌తో తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడు. అచ్చ తెలుగు టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. సత్యదేవ్ కొత్త సినిమాకు సమవర్తి అనే టైటిల్ ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. ఈ సినిమాకు అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎకోలాజికల్...
సమవర్తి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్ చుట్టూ రక్తం మరకలతో కూడిన గొడ్డళ్లు, కత్తులు ఉన్నాయి. ఆయుధాలు తనవైపు దూసుకొస్తున్నా ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ కూల్‌గా ఇంటెన్స్ లుక్‌లో సత్యదేవ్ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. బ్యాక్‌డ్రాప్‌లో పులితో పాటు గిరిజనులు వాడే కొన్ని ఆయుధాలు, వస్తువులు ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే విభిన్నమైన జానర్‌లో ఈ సినిమా రూపొందుతోందట. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సమవర్తిలో సత్యదేవ్ తో పాటు దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
మహేష్‌బాబు ప్రజెంటర్...
మరోవైపు సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ జూలై 3న థియేటర్లలోకి రాబోతుంది. టాలీవుడ్ అగ్ర హీరో మహేష్‌బాబు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు – యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
మే 22, 2026

Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ – మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
మే 22, 2026

Pooja Hegde | మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా పూజా హెగ్డే.. ఇక కెరీర్ ట్రాక్‌లో పడినట్లేనా..?
మే 22, 2026
తాజావార్తలు
- ●Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ
- ●Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!
- ●Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి
- ●Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
- ●Xiaomi YU7 | షియోమీ నుంచి బీస్ట్ తరహా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. 2.92 సెకన్లలో 100 కి.మీ. వేగం.. 700 కి.మీ. రేంజ్..
- ●Brahmotsavams | రేపటి నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27న గరుడ సేవ

Vishnu Priya | నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు - యూట్యూబర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విష్ణుప్రియ

Komati Reddy | ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి సర్ప్రైజ్ గిఫ్ట్.. విమానంలో వైజాగ్ టూర్..!

Venkateshwar Reddy, Narendar Reddy | హరీశ్‌రావు ఉన్నమాటే అన్నారు.. అవాకులు, చెవాకులెందుకు యెన్నం: మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి

Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..



