Karne Prabhakar | ఉద్యమకారుల కమిటీ ఉంటే ఏంది.. లేకుంటే ఏంది?
Karne Prabhakar | చట్టబద్ధమైన, కాలపరిమితి లేని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేశారని, కార్యాలయమే లేని ఈ ఉద్యమకారుల కమిటీ ఉంటే ఏంది? లేకపోతే ఏందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణను వద్దన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీలను ఎందుకు పిలిచారని నిలదీశారు.
- చట్టబద్దమైన, కాలపరిమితి లేని కమిటీ వేశారు
- తెలంగాణను వద్దన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీలను సమావేశానికి పిలిచారు
- బీఆర్ఎస్ 582 మంది కళాకారులకు ఉద్యోలిచ్చింది
- ఈ ప్రభుత్వం మిగిలినవారిని గుర్తించాలి
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్
Karne Prabhakar | త్రినేత్ర.న్యూస్: చట్టబద్ధమైన, కాలపరిమితి లేని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేశారని, కార్యాలయమే లేని ఈ ఉద్యమకారుల కమిటీ ఉంటే ఏంది? లేకపోతే ఏందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సమావేశానికి బీఆర్ఎస్ హాజరైందని.. కానీ తెలంగాణను వద్దన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీలను ఎందుకు పిలిచారని నిలదీశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
డిక్షనరీలో తెలంగాణ పదం లేదన్నోళ్లను పిలిచారు..
మా పార్టీ పక్షాన మేం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పాం. ఉద్యమకారులకు బీఆర్ఎస్ ఏ విధంగా గుర్తింపు ఇచ్చిందో, ఈ ప్రభుత్వం అలానే ఇవ్వాలని డిమాండ్ చేశాం. దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు ఉద్యమకారుల గుర్తింపును సైతం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను ఉద్యమకారుల సమావేశానికి పిలిచారు. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీలను పిలిచారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అంటున్నారు. అలాంటి పార్టీని ఈ సమావేశానికి ఎలా పిలుస్తారు అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇంకెవరైనా ఉంటే గుర్తించాలి..
తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకరకాలుగా ఆదుకుంది. బీఆర్ఎస్ హయాంలో 582 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాం. 610 మంది ఉద్యమకారులను గుర్తించి వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది. తెలంగాణ ఉద్యమకారుల విషయంలో ఈ ప్రభుత్వం లోతైన విచారణ చేసి తెలంగాణ ఉద్యమకారులు ఇంకెవరైనా ఉంటే గుర్తించాలి. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ప్రభాకర్ అన్నారు.
వారిని పిలవొద్దు..
మరో 5 యేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న రేవంత్ రెడ్డి టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన బీఆర్ఎస్ నిఖార్సుగా కోట్లాడుతుంది. ఇప్పటికైనా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను ఉద్యమకారుల సమావేశానికి పిలవొద్దు అని మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Jr Ntr | భగీర కోసం ఎన్టీఆర్ నెలకు ఎంతో ఖర్చు చేసేవారంటే?
- ●KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి
- ●KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
- ●Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్
- ●స్పందనలో వేగం… నిరంతర ఉద్యమాల్లో పరిమితులు: బీఆర్ఎస్ పోరాటానికి 40-45% మార్కులేనా?
- ●Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు

Jr Ntr | భగీర కోసం ఎన్టీఆర్ నెలకు ఎంతో ఖర్చు చేసేవారంటే?

KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్

Red Chilli Powder | కారం పొడిలో 30 శాతం రంపపు పొడి.. 3,350 కిలోలు సీజ్





