Sara Arjun | ధురంధర్ 2 మూవీ కోసం సారా అర్జున్ రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?
ధురంధర్ మూవీతోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సారా అర్జున్. ధురంధర్ 2 మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా రెండు పార్ట్‌లకు కలిపి సారా అర్జున్ కోటి మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Mar 22, 2026, 8.57 am IST
Sara Arjun | బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 హవా కొనసాగుతోంది. రిలీజై మూడు రోజులు అవుతోన్న ఇప్పటికీ ఈ సినిమా టికెట్స్ దొరకడం లేదు. రోజు రోజుకు ఈ బాలీవుడ్ మూవీ క్రేజ్ పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 330 కోట్ల వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమా దిశగా ధురంధర్ 2 సాగుతోంది. ధురంధర్ 2 ప్రభంజనం చూస్తుంటే ఈ బాలీవుడ్ ఈజీగా రెండు వేల కోట్ల వసూళ్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు.
తెలుగులో హౌజ్‌ఫుల్...
ధురంధర్ 2 తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు శనివారం రిలీజయ్యాయి. తెలుగులో హౌజ్‌ఫుల్స్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది.
ధురంధర్ ఆదిత్య ధర్ టేకింగ్, మేకింగ్, రణవీర్‌సింగ్, సంజయ్ దత్, మాధవన్ తో పాటు ఇతర నటీనటుల యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇండియన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్, బెంచ్ మార్క్ అంటూ ప్రశంసలు కురిపిస్తోన్నారు.
అతి తక్కువ రెమ్యూనరేషన్...
ఈ స్పై యాక్షన్ మూవీలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రణవీర్‌సింగ్ ప్రియురాలిగా, భార్యగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. ధురంధర్, ధురంధర్ 2 సినిమాల కోసం సారా అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలకు కలిపి కేవలం కోటి రూపాయలు మాత్రమే సారా అర్జున్‌కు రెమ్యూనరేషన్‌గా మేకర్స్ అందజేశారట. ఈ సినిమాల కోసం అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నది ఆమెనని అంటున్నారు.
సారా అర్జున్ రెమ్యూనరేషన్ విషయంలో ధురంధర్ 2 మేకర్స్‌పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. మరీ అంత తక్కువా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మూడు వేల కోట్ల సినిమాలో నటించినందుకు కోటి ఇవ్వడం ఏంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో దక్షిణాది ఇండస్ట్రీనే బెటర్ అంటూ పేర్కొంటున్నారు. నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
లాభాల్లో వాటా...
ధురంధర్ రెండు పార్టులకు కలిపి రణవీర్‌సింగ్ యాభై కోట్లకుపైనే రెమ్యూనరేషన్ అందుకున్నాడట. లాభాల్లో వాటా కూడా అతడికి దక్కినట్లు సమాచారం. ఈ సినిమాల ద్వారా హీరో వందల కోట్లు సంపాదిస్తే హీరోయిన్‌కు మాత్రం కోటి ఇవ్వడం అన్యాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌లో లింగ వివక్ష ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎంగ్జాంపుల్ అని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



