త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sara Arjun | జెర్సీ డైరెక్ట‌ర్‌తో ధురంధ‌ర్ 2 హీరోయిన్ తెలుగు మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌

ధురంధ‌ర్ హీరోయిన్ సారా అర్జున్ న‌టించిన తెలుగు మూవీ మ్యాజిక్ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మ్యూజిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

N

Entertainment | Published On Jun 9, 2026, 4.14 pm IST

Sara Arjun | జెర్సీ డైరెక్ట‌ర్‌తో ధురంధ‌ర్ 2 హీరోయిన్ తెలుగు మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌
Advertisement

Sara Arjun | ధురంధ‌ర్ , ధురంధ‌ర్ 2 సినిమాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది సౌత్ బ్యూటీ సారా అర్జున్‌. తొలి అడుగులోనే హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకుంది. ర‌ణ‌వీర్‌సింగ్ క‌థానాయ‌కుడిగా స్పై యాక్ష‌న్ క‌థాంశాల‌తో రూపొందిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద 3500 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ధురంధ‌ర్‌, ధురంధ‌ర్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో బాలీవుడ్ లోనే కాకుండా సౌత్‌లోనూ టాప్ బ్యాన‌ర్ల నుంచి సారా అర్జున్‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

డెబ్యూ మూవీ...

ధురంధ‌ర్ కంటే ముందు తెలుగులో మ్యాజిక్ పేరుతో సారా అర్జున్ ఓ సినిమా చేసింది. హీరోయిన్‌గా సారా అర్జున్ అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ ఇది. జెర్సీ, కింగ్‌డ‌మ్ సినిమాల ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మ్యాజిక్‌ షూటింగ్ పూర్త‌య్యింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డిలే అవుతూ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స‌య్యార‌ట‌. నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ ఒకే అయిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే మ్యాజిక్ ఓటీటీ విడుద‌ల తేదీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతోన్నారు. జూలైలో ఈ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కింగ్‌డ‌మ్ ఎఫెక్ట్‌...

రిలీజ్ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల సినిమాపై బ‌జ్ త‌గ్గిపోవ‌డం, ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య‌ను దృష్టిలో పెట్టుకొని మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వాటికి తోడు గౌత‌మ్ తిన్న‌నూరి కింగ్‌డ‌మ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిల‌వ‌డం కూడా ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌...

ఓ కాలేజీ ఫెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో న్యూ ఏజ్ మ్యూజిక‌ల్ డ్రామాగా మ్యాజిక్ రూపొందుతోంది. ఈ సినిమాలో సారా అర్జున్‌తో పాటు ఆకాష్ శ్రీనివాస్‌, అన్‌మోల్‌, సిద్ధార్థ్ త‌ణుకు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించారు.

 

Advertisement
Advertisement