Malayalam OTT | ఇరుముడి టీచర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ – ఒక్క రాత్రిలో జరిగే కథ
ఇరుముడి ఫేమ్ స్వాసిక హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ జెన్నీఫర్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్క రాత్రిలో జరిగే కథతో దర్శకుడు అల్తాఫ్ రహమాన్ ఈ సినిమాను రూపొందించారు.
Entertainment | Published On Nov 1, 2026, 2.49 pm IST
Malayalam OTT | రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఇరుముడి ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో తమిళ నటి స్వాసిక నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. టీచర్ పాత్రతో ఆడియెన్స్‌ను భయపెట్టింది. ఇరుముడి విజయంతో స్వాసిక టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళంలో సినిమాలు చేస్తోంది.
సర్వైవల్ థ్రిల్లర్...
స్వాసిక హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ జెన్నిఫర్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అల్తాఫ్ రహమాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్వాసికతో పాటు బినుదేవ్, ఆంటోనీ వర్గీస్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు. సిజో జాన్ మ్యూజిక్ అందించారు.
ఒక్క రాత్రిలో జరిగే కథ...
ఒక్క రాత్రిలో జరిగే కథతో దర్శకుడు అల్తాఫ్ ఈ సినిమాను రూపొందించారు. జెన్నీఫర్ అనే మహిళ తన భర్తతో కలిసి హిల్ స్టేషన్‌లో ఉన్న ఫామ్‌హౌజ్‌కు వస్తుంది. అదే రోజు రాత్రి మాస్క్‌లు ధరించిన కొందరు వ్యక్తులు జెన్సీఫర్‌పై దాడిచేస్తారు. ఆమెను చంపాలని చూస్తారు. వారి దాడి నుంచి జెన్నీఫర్ ఎలా బయటపడింది? ఈ మాస్క్ ధరించిన వ్యక్తులు ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
వివాదం...
కాగా ఇరుముడిలో స్వాసిక పాత్రపై ప్రశంసలుతో పాటు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ టీచర్లను అభ్యంతరకరంగా చూపించారంటూ కేసులు పెట్టారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – తెలుగు సినిమాలు హైలైట్…
అక్టోబర్ 30, 2026

Web Series Review | రుద్రవనం రివ్యూ – ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
అక్టోబర్ 30, 2026

Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●India GST Collection October | రికార్డు సృష్టించిన అక్టోబర్ జీఎస్టీ కలెక్షన్లు: రూ.2.31 లక్షల కోట్లు వసూలు.. తెలంగాణ వాటా ఇదే!
- ●HMWSSB | హైదరాబాదీలకు అలెర్ట్.. 36 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్
- ●Centre Tax Devolution to States | తెలంగాణకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. భారీగా నిధులు విడుదల
- ●Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్
- ●JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర
- ●Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...

India GST Collection October | రికార్డు సృష్టించిన అక్టోబర్ జీఎస్టీ కలెక్షన్లు: రూ.2.31 లక్షల కోట్లు వసూలు.. తెలంగాణ వాటా ఇదే!

HMWSSB | హైదరాబాదీలకు అలెర్ట్.. 36 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్

Centre Tax Devolution to States | తెలంగాణకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. భారీగా నిధులు విడుదల

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్



