Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? – ఆర్‌సీ 17పై కొత్త రూమర్
ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ తెలుగులో ఓ బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో సరసన హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్‌సీ 17లో హీరోయిన్‌గా ఈ ముంబై బ్యూటీని డైరెక్టర్ సుకుమార్ ఎంపికచేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Entertainment | Published On Aug 18, 2026, 6.08 pm IST
Sara Arjun | ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ తెలుగులో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ధురంధర్ మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది ఈ ముంబై బ్యూటీ. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ ప్రియురాలిగా, భార్యగా ఎమోషనల్ రోల్‌తో అద్భుత నటనను కనబరిచింది.. ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు నిర్మాతలకు లాభాల పంటను పండించాయి. రెండు పార్ట్‌లు కలిపి 3200 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నారు. హీరోయిన్‌గా అరంగేట్రంలోనే బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్లను దక్కించుకున్న హీరోయిన్‌గా సారా అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసింది.
లక్కీ ఛాన్స్...
ధురంధర్ 2 తర్వాత ఈ బ్యూటీకి అగ్ర దర్శకుల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తెలుగులో సారా అర్జున్ ఓ లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మెగా హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్నట్లు చెబుతోన్నారు.
ఆర్‌సీ 17...
రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకు గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న పదిహేడవ మూవీ ఇది. ఈ సినిమాకు ఆర్‌సీ 17 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
కియారా అద్వానీ, కృతి సనన్...
కాగా ఆర్‌సీ 17లో హీరోయిన్ కోసం సుకుమార్ అండ్ టీమ్ గత కొద్ది రోజులుగా అన్వేషణ సాగిస్తున్నారు. రష్మిక మందన్న, కియారా అద్వానీ, కృతి సనన్‌తో పాటు పలువురు నాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరందరిని కాదని ఈ ఛాన్స్‌ను సారా అర్జున్ దక్కించుకున్నట్లు సమాచారం. ధురంధర్ 2లో సారా అర్జున్ నటనకు సుకుమార్ తెగ ఇంప్రెస్ అయినట్లు తెలిసింది. ఈ బాలీవుడ్ మూవీ చూసే ఆర్‌సీ 17లో ముంబై బ్యూటీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్‌లో రామ్‌చరణ్, సారా అర్జున్‌లపై ఓ ఫొటో షూట్ నిర్వహించబోతున్నట్లు చెబుతున్నారు. ఆ ఫొటో షూట్ తర్వాతే సారా అర్జున్ పేరును అఫీషియల్‌గా కన్ఫామ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ – పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ – లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
ఆగస్టు 18, 2026

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ – విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
ఆగస్టు 18, 2026

Anasuya | అనసూయపై కేసు.. వ్యాఖ్యలపై తగ్గేదేలేదంటున్న నటి
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
- ●Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!
- ●CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
- ●India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..
- ●Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!
- ●ICC Player of the Month | వెస్టిండీస్ ప్లేయర్ల జోరు.. గ్రీవ్స్, హేలీ మాథ్యూస్‌కు ఐసీసీ అవార్డులు

Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..



