త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajay Devgn | అజ‌య్ దేవ్‌గ‌ణ్ నివాసంలో అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత – క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌…

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కు ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ షాకిచ్చింది. జుహూ ప్రాంత‌లో ఆయ‌న నివాసంలో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేసింది. ఈ కూల్చివేత‌ల‌పై అజ‌య్ దేవ్‌గ‌ణ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

N

Entertainment | Published On Oct 17, 2026, 8.48 pm IST

Ajay Devgn | అజ‌య్ దేవ్‌గ‌ణ్ నివాసంలో అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత – క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌…
Advertisement

Ajay Devgn  బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కు ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ షాకిచ్చింది. జుహు ప్రాంతంలో ఉన్న ఆయ‌న నివాసంలో అనుమ‌తులు లేకుండా చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌ను మున్సిప‌ల్ సిబ్బంది కూల్చివేశారు. జుహూలోని క‌పోల్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీలో అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌కు ఓ బంగ‌ళా ఉంది.ఈ భ‌వంతిలో ఇటీవ‌లే ఇంటీరియ‌ర్‌, గోడ‌లు, కిటికీల‌కు సంబంధించిన మాడిఫికేష‌న్ ప‌నులు చేప‌ట్టారు. ఈ ప‌నుల‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు తీసుకోలేద‌ని మున్సిప‌ల్ అధికారులు వెల్ల‌డించారు. అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసులు కూడా జారీ చేశామ‌ని, ఆయిన ప‌నులు ఆప‌క‌పోవ‌డంతో కూల్చివేసిన‌ట్లు చెప్పారు.

సొంత‌మే కానీ...

ఈ కూల్చివేత‌ల‌పై అజ‌య్ దేవ్‌గ‌ణ్ టీమ్ స్పందించింది. ఆ బంగ‌ళా అజ‌య్ దేవ్‌గ‌ణ్ సొంత‌మే కానీ అందులో ఆయ‌న నివాసం ఉండ‌టం లేద‌ని వెల్ల‌డించారు. దానిని ఆయ‌న ఈ ఏడాది అగ‌స్ట్‌లో ఫ్లోరియ‌న్ హ్యూరెల్ అనే సంస్థ‌కు అద్దెకు ఇచ్చార‌ని పేర్కొన్నారు. మాడిఫికేష‌న్ ప‌నుల‌కు సంబంధించి బీఎంసీ అనుమ‌తుల‌కు అప్లై చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్ నిబంధ‌నల‌ను అతిక్ర‌మించారంటూ వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న టీమ్ చెప్పింది. నెల‌కు ప‌ద‌హారు ల‌క్ష‌ల చొప్పున ఐదు సంవ‌త్స‌రాల‌కు స‌ద‌రు సంస్థ అజ‌య్ దేవ్‌గ‌ణ్ నుంచి ఆ బిల్డింగ్‌ను లీజుకు తీసుకున్న‌ట్లు స‌మాచారం.

సొసైటీ కంప్లైంట్‌...

లీజు కోసం హౌజింగ్ సొసైటీ నుంచి అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఎన్‌వోసీ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, వాణిజ్య ప‌ర‌మైన అవ‌స‌రాల కోసం బిల్డింగ్‌ను వాడ‌టానికి సొసైటీ అనుమ‌తించ‌లేద‌ని స‌మాచారం. హౌజింగ్ సొసైటీ కంప్లైంట్‌తోనే కూల్చివేత‌లు జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దృశ్యం 3...

ఇటీవ‌లే దృశ్యం 3 మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. 400 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శ్రియా, ట‌బు, ప్ర‌కాష్ రాజ్‌, జైదీప్ అహ్ల‌వ‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

Advertisement
Advertisement