Couple Friendly Review | కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ – మిస్ ఇండియా హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేమికుల రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 14, 2026, 11.22 am IST
Couple Friendly Review | సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం థియేటర్లలోకి వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిన్న సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? సంతోష్ శోభన్, మానస వారణాసి జంట తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారా? లేదా? అంటే?
సంతోష్...మిత్ర...లివింగ్ టుగెదర్...
శివ ( సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు కంప్లీట్ చేస్తాడు. చదువుకు తగ్గ జాబ్ దొరక్కపోవడంతో ఖాళీగా ఉంటాడు. తన సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నావంటూ రోజు తండ్రి నుంచి తిట్లు తింటుంటాడు. తండ్రి పోరు భరించలేక చెన్నై వెళ్లిపోతాడు. ఖర్చుల కోసం ర్యాపిడో నడుపుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. మిత్ర (మానస వారణాసి) కూడా ఐటీ జాబ్ కోసం చెన్నై వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన జాబ్ మాత్రం దొరకదు. ఇంట్లో మాత్రం జాబ్ చేస్తున్నానని అబద్దం ఆడుతుంది. అనుకోకుండా హాస్టల్ ఖాళీ చేసిన మిత్రకు ఎక్కడ షెల్టర్ దొరకదు. ర్యాపిడో ద్వారా పరిచయమైన శివ రూమ్ లోనే ఆమె ఉండాల్సివస్తుంది. శివ కెరీర్‌కు మిత్ర హెల్ప్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వీరిద్దరు కలిసి ఓకే రూమ్‌లో ఉంటున్న విషయం శివ, మిత్ర పేరెంట్స్‌కు తెలుస్తుంది? ఆ తర్వాత ఏమైంది? శివ చేసిన తప్పు వల్ల మిత్ర అతడికి దూరమవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? మిత్ర గురించి శివకు తెలిసిన ఓ షాకింగ్ నిజం ఏమిటి? అన్నదే కపుల్ ఫ్రెండ్లీ మూవీ కథ.
బోల్డ్‌గా...
ప్రస్తుతం ప్రేమకథల తీరు మారింది. జెన్‌జీ ఆడియెన్స్‌న అట్రాక్ట్ చేయాలంటే బోల్డ్‌గా చెప్పడం తప్పనిసరి అనే అభిప్రాయ దర్శకుల్లో కనిపిస్తోంది. లేదంటే ఎంటర్‌టైనింగ్‌గా లవ్‌స్టోరీస్‌ను రాసుకుంటున్నారు. రియలిస్టిక్ అప్రోచ్‌తో పొయెటిక్‌గా సాగే ప్రేమకథల సంఖ్య తగ్గింది. రోజుల తర్వాత కంపుల్ ఫ్రెండ్లీ సినిమా ఆ లోటును భర్తీ చేసింది.
లిప్‌లాక్‌లు తప్పితే...
ఎలాంటి పరిచయం లేని భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట అనుకోకుండా కలిసి ఒకే రూమ్‌లో ఉండాల్సిరావడం...ఆ తర్వాత ప్రేమలో పడటం...కలిసి బతకాలని నిశ్చయించుకునేలోపే విడిపోవడం..లాంటి అంశాలతో సింపుల్‌గా కపుల్ ఫ్రెండ్లీ మూవీ కథను రాసుకున్నాడు డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్. లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ అనగానే ఆడియెన్స్ బోల్డ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. దర్శకుడికి ఆ దిశగా కథను నడిపించే అవకాశం ఉంది. కానీ ఒకటి రెండు ముద్దు సన్నివేశాలు తప్పితే చాలా వరకు బ్యూటీఫుల్ ఎమోషనల్ జర్నీగానే దర్శకుడు ఈ సినిమాను నడిపించాడు.
గెరిల్లా పద్దతిలో షూట్ చేసిన కొన్ని సీన్ల వల్ల సినిమా చూస్తున్నట్లుగా కాకుండా నిజంగానే ఓ జంట జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినట్లుగా అనిపిస్తుంది. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్ కూడా దర్శకుడు బాగానే వాడుకున్నాడు.
జెన్యూన్ క్లైమాక్స్...
శివ, మిత్ర పాత్రల పరిచయం, జాబ్ కోసం వారు పడే కష్టాలు, కలిసి ఒకే రూమ్‌లో ఉండాల్సిన పరిస్థితులతో ఫస్ట్ హాఫ్ ఆహ్లాదంగా సాగిపోతుంది. సఫరేట్‌గా కామెడీ ట్రాక్‌లు రాసుకోకుండా వారి జర్నీ నుంచి అంతర్లీనంగా వినోదాన్ని రాబట్టుకోవడం బాగుంది. సెకండాఫ్ కథ మొత్తం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. శివకు దూరమైన మిత్ర...మరో అబ్బాయితో పెళ్లికి సిద్ధపడటం, ఈ క్రమంలోనే ఆమె జీవితంలో ఊహించని మలుపు చోటుచేసుకునే సన్నివేశాలను హృద్యంగా చూపించారు. సినిమాటిక్ లిబర్జీ తీసుకోకుండా జెన్యూన్‌గా క్లైమాక్స్‌ను ముగించిన తీరు బాగుంది. ఇలాంటి ఎండింగ్‌ను తెలుగు ఆడియెన్స్ ఎంత వరకు స్వీకరిస్తారన్నది చూడాల్సిందే.
గీతాంజలి....
కపుల్ ఫ్రెండ్లీ కథలో కొత్తదనం లేదు. గతంలో ఓయ్, గీతాంజలితో పాటు ఇలాంటి కాన్సెప్ట్‌లతో చాలానే సినిమాలు వచ్చాయి. వాటి ఛాయలు ఇందులో కనిపిస్తాయి. చాలా వరకు స్క్రీన్‌ప్లే ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది.
బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్...
శివ పాత్రలో సంతోష్ శోభన్ పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునేలా సంతోష్ శోభన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేయడం బాగుంది. మిత్ర పాత్రలో మానస వారణాసి నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మానస రూపంలో టాలీవుడ్‌కు మరో మంచి హీరోయిన్ దొరికింది. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకుంది. యోగిబాబు కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. గోపరాజు రమణ, రాజీవ్ కనకాల పరిధుల మేర మెప్పించారు. ఆదిత్య రవీంద్రన్ పాటలు, బీజీఎమ్ కథలోని ఫీల్‌ను మరింత ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.
కపుల్ ఫ్రెండ్లీ పొయెటిక్ లవ్‌స్టోరీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



