త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి లేటెస్ట్‌ తెలుగు రొమాంటిక్ మూవీ – ప్ర‌భాస్ మెచ్చిన సినిమా

సంతోష్ శోభ‌న్‌, మాన‌స వార‌ణాసి జంట‌గా న‌టించిన రొమాంటిక్ మూవీ క‌పుల్ ఫ్రెండ్లీ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ప్ర‌భాస్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డంతో ఈ చిన్న సినిమా థియేట‌ర్ల‌లో భారీగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

N

Entertainment | Published On Mar 6, 2026, 5.54 pm IST

OTT | ఓటీటీలోకి లేటెస్ట్‌ తెలుగు రొమాంటిక్ మూవీ  – ప్ర‌భాస్ మెచ్చిన సినిమా
Advertisement

OTT |  సంతోష్ శోభ‌న్‌, మాన‌స వార‌ణాసి హీరోహీరోయిన్లుగా న‌టించిన కపుల్ ఫ్రెండ్లీ డీసెంట్ ల‌వ్‌స్టోరీగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. వాలెంటైన్స్ డే కానుక‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
క‌పుల్ ఫ్రెండ్లీ మూవీలో రాజీవ్ క‌న‌కాల‌, గోప‌రాజు ర‌మ‌ణ‌తో పాటు కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ప్ర‌భాస్ ప్ర‌మోష‌న్స్‌...

క‌పుల్ ఫ్రెండ్లీ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌భాస్ పాల్గొన‌డంతో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమా కోసం హీరోహీరోయిన్ల‌తో క‌లిసి ఓ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ పాల్గొన్నాడు. క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ త‌న‌కు బాగా న‌చ్చిందంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. మ‌ణిర‌త్నం గీతాంజ‌లి చూసిన ఫీలింగ్ క‌లిగిందంటూ ప్ర‌భాస్ చెప్పాడు. ప్ర‌భాస్ ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా క‌పుల్ ఫ్రెండ్లీకి క‌లెక్ష‌న్స్ భారీగానే వ‌చ్చాయి. ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 12 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

టైటిల్‌పై వివాదం...

క‌పుల్ ఫ్రెండ్లీ మూవీకి ఆదిత్య ర‌వీంద్ర‌న్ మ్యూజిక్ అందించాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా టైటిల్‌పై సెన్సార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంపై నిర్మాత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

క‌పుల్ ఫ్రెండ్లీ క‌థ ఇదే...

శివ ( సంతోష్ శోభ‌న్‌) ఇంటీరియ‌ర్ డిజైనింగ్ కోర్సు కంప్లీట్ చేస్తాడు. చ‌దువుకు త‌గ్గ జాబ్ దొర‌క్క‌పోవ‌డంతో ర్యాపిడో న‌డుపుతుంటాడు. మిత్ర (మాన‌స వార‌ణాసి) కూడా ఐటీ జాబ్ కోసం చెన్నై వ‌స్తుంది. అనుకోకుండా హాస్ట‌ల్ ఖాళీ చేసిన మిత్రకు ఎక్క‌డ షెల్ట‌ర్ దొర‌క‌దు. ర్యాపిడో ద్వారా ప‌రిచ‌య‌మైన శివ రూమ్ లోనే ఆమె ఉండాల్సివ‌స్తుంది. శివ కెరీర్‌కు మిత్ర హెల్ప్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. వీరిద్ద‌రు క‌లిసి ఓకే రూమ్‌లో ఉంటున్న విష‌యం శివ‌, మిత్ర పేరెంట్స్‌కు ఎలా తెలిసింది? ఆ త‌ర్వాత ఏమైంది? శివ చేసిన త‌ప్పు వ‌ల్ల మిత్ర అత‌డికి ఎందుకు దూర‌మైంది? మిత్ర గురించి శివ‌కు తెలిసిన ఓ షాకింగ్ నిజం ఏమిటి? అన్న‌దే క‌పుల్ ఫ్రెండ్లీ మూవీ క‌థ‌.

Advertisement
Advertisement