Sanjana Galrani | బిగ్‌బాస్ మళ్లీ తలెత్తుకొని తిరిగేలా చేసింది – రీఎంట్రీపై సంజనా గర్లానీ క్లారిటీ
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బిగ్‌బాస్ 9 తెలుగు ఫైనలిస్ట్ సంజనా గల్రానీ చెప్పింది. ఐదేళ్ల క్రితం తనపై పడిన ఓ ముద్ర నుంచి బయటపడటానికే తాను బిగ్‌బాస్‌కు వెళ్లానని చెప్పింది. బిగ్‌బాస్‌తో మళ్లీ తన కెరీర్ కొత్తగా మొదలైందని అన్నది.
Entertainment | Published On Dec 27, 2025, 7.29 pm IST
Sanjana Galrani | బిగ్‌బాస్ లో జీవితంలో మళ్లీ గర్వంగా తనను తెలెత్తుకొని తిరిగేలా చేసిందని ఫైనలిస్ట్ సంజనా గల్రానీ అన్నది. బిగ్‌బాస్ 9 తెలుగుకు ఇటీవలే ఎండ్ కార్డ్ పడింది. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచాడు. ఫైనల్‌కు కళ్యాణ్‌తో పాటు తనూజ, డీమోన్ పవన్, సంజనా గల్రానీ, ఇమాన్యుయేల్ చేరుకున్నారు. ఈ ఫైనల్‌లో సంజనా గల్రానీ ఫోర్త్ రన్నరప్‌గా ఎలిమినేట్ అయ్యింది. 105 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన సంజన కప్పు కోసం చివరి వరకు పోరాడింది. కానీ ఫైనల్ వీక్‌లో ఓటింగ్‌లో వెనుకబడిన సంజనా గల్రానీ అనుహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. తాజాగా తన బిగ్‌బాస్ జర్నీ గురించి శనివారం అభిమానులతో పంచుకుంది సంజన.
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు...
"ఐదేళ్ళ క్రితం తన ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన జీవితంతో పాటు ,కెరీర్ ను మలుపుతిప్పింది. తెలుగు ఆడియెన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సంఘటనకు కృంగిపోకుండా ప్రతికూల పరిస్థితుల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడాను. నాపై పడిన ముద్రను తొలగించుకోవాలనే బిగ్‌బాస్‌కు వెళ్లాను. చివరికి విజేతగా నిలిచాను" అని సంజన పేర్కొన్నది.
మళ్లీ తలెత్తుకునేలా చేసింది...
బిగ్ బాస్ నుంచి ఎంతో నేర్చుకున్నానని సంజనా చెప్పింది. "బిగ్‌బాస్ జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణమైంది. ఈ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బిగ్‌బాస్‌తో నాగార్జునకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాను. బిగ్‌బాస్ షోతో మళ్లీ నా కెరీర్ కొత్తగా ప్రారంభమైన ఫీలింగ్ కలిగింది. మళ్లీ సినిమాల్లో నటిస్తా. ఇప్పటికే కొన్ని అవకాశాలు వస్తున్నాయి" అని సంజన అన్నది.
బిగ్‌బాస్‌లో ఇమాన్యుయేల్ చాలా సపోర్ట్ చేశాడని అన్నది. పిల్లలను వదిలిపెట్టి బిగ్‌బాస్ హౌజ్‌లో 105 రోజులు ఉండటం చాలా కష్టమైందని, చాలా సార్లు ఎమోషనల్ అయ్యానని సంజన చెప్పింది. హౌజ్‌లో స్వీటెస్ట్ పర్సన్ అంటే సుమన్ శెట్టి అని తెలిపింది. ప్రభాస్ సినిమాలో మళ్లీ అవకాశం వస్తే నటిస్తానని సంజన పేర్కొన్నది.
సోగ్గాడు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన బుజ్జిగాడు మేడిన్ చెన్నై, సత్యమేవ జయతే, ముగ్గురు, యమహోయమఃతో పాటు యాభైకిపైగా సినిమాలు చేసింది. 2021లో అజీస్ పాషా అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న సంజన సినిమాలకు దూరమైంది.
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Divvela Madhuri | సినిమాల్లోకి దువ్వాడ మాధురి ఎంట్రీ – గైరమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై రచ్చ
ఏప్రిల్ 28, 2026

Divvela Madhuri | తిరుమలలో తనూజ బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన దివ్వెల మాధురి – కేసు నమోదు చేసిన పోలీసులు
మార్చి 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



