త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సందీప్ వంగా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రోమాంచ‌కం ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. అక్టోబ‌ర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక స‌నీల్ కుమార్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Sep 28, 2026, 1.39 pm IST

Romantic OTT | ఓటీటీలోకి  అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
Advertisement

Romantic OTT |  అర్జున్‌, యానిమ‌ల్ సినిమాల ద‌ర్శ‌కుడు సందీప్ వంగా తెలుగులో రోమాంచ‌కం పేరుతో ఓ చిన్న సినిమాను నిర్మించారు. సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక స‌నీల్ కుమార్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డేటింగ్ యాప్ క‌ల్చ‌ర్‌కు ఓ యువ జంట ప్రేమ‌క‌థ‌ను జోడించి రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

సందీప్ వంగా ప్రొడ్యూస‌ర్...

సందీప్ వంగా ప్రొడ్యూస‌ర్ కావ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌టంతో ఈ చిన్న సినిమాపై తెలుగు ఆడియెన్స్‌లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో రొమాంచ‌కం క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఓటీటీలోకి...

తాజాగా రోమాంచ‌కం మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

డేటింగ్ యాప్ ...

అన్వేష్ ఇంజినీరింగ్ పూర్తిచేస్తాడు. జాబ్ చేయ‌డం ఇష్టం ఉండ‌దు. సొంతంగా ఓ డేటింగ్ యాప్ మొద‌లుపెట్టాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఆ యాప్ ట్ర‌య‌ల్స్‌లో అత‌డికి మైథిలి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రి ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు క‌లుస్తాయి. ప్రేమ‌లో ప‌డ‌తాడు. ప్రియుడి కోసం ఇంట్లోవాళ్ల‌కు చెప్ప‌కుండా మైథిలి హైద‌రాబాద్ వ‌స్తుంది. అన్వేష్‌ను క‌లిసిన త‌ర్వాత మైథిలి క‌నిపించ‌కుండాపోతుంది. ప్రియురాలు ఏమైందో, ఎక్క‌డికి వెళ్లిందో తెలియ‌ని అయోమ‌యంలో అన్వేష్ ప‌డిపోతాడు. అత‌డికి సాయం చేసిన స్నేహితులు సైతం చిక్కుల్లో ప‌డ‌తాడు. మైథిలి జాడ‌క‌నిపెట్టే ప్ర‌య‌త్నంలో ఓ పోలీస్ ఆఫీస‌ర్‌కు టార్గెట్‌గా మారుతారు. మైథిలి మిస్సింగ్‌కు కార‌ణ‌మేమిటి? మైథిలి ప్రేమ‌ను అపార్థం చేసుకున్న అన్వేష్ ఎలా రియ‌లైజ్ అయ్యాడు అన్న‌దే మిగిలిన క‌థ‌.

8 వ‌సంతాలు ఫేమ్‌

రోమాంచ‌కం కంటే ముందు అనంతిక స‌నీల్ కుమార్ మ్యాడ్‌, 8 వ‌సంతాలు సినిమాలు చేసింది. మేము ఫేమ‌స్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్ర‌భాస్‌. ఈ ఏడాది రోమాంచ‌కం మూవీతో గోదారి గ‌ట్టుపైన పేరుతో మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ చేశాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement