త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | సందీప్ వంగా బాలీవుడ్ రొమాంటిక్‌ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఛేంజ్

సందీప్ వంగా క‌బీర్‌సింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారింది. ఇన్నాళ్లు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ తాజాగా జియో హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆదివారం నుంచి జియో హాట్‌స్టార్‌లో క‌బీర్‌సింగ్ స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Dec 28, 2025, 2.37 pm IST

OTT |  సందీప్ వంగా బాలీవుడ్ రొమాంటిక్‌ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఛేంజ్

క‌బీర్‌సింగ్

Advertisement

OTT |  సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ క‌బీర్‌సింగ్ మరో ఓటీటీలోకి వ‌చ్చింది. ఆదివారం జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజైంది. ఇన్నాళ్లు క‌బీర్‌సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇటీవ‌లే ఓటీటీ రైట్స్ గుడువు ముగిసింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఆదివారం నుంచి హాట్ స్టార్‌లో కబీర్ సింగ్ అందుబాటులోకి వ‌చ్చింది.
అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెర‌కెక్కిన క‌బీర్‌సింగ్‌తోనే డైరెక్టర్ సందీప్ వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్ట‌య్యింది. అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన క‌బీర్‌సింగ్ థియేట‌ర్ల‌లో 380 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

బోల్డ్ కాన్సెప్ట్‌...

అర్జున్ రెడ్డి క‌థ‌లో హిందీ నేటివిటీ అనుగుణంగా ప‌లు మార్పులు చేర్పులు చేస్తూ క‌బీర్‌సింగ్ మూవీని రూపొందించారు సందీప్ వంగా. తెలుగు వెర్ష‌న్‌కు వ‌చ్చిన‌ట్లు బోల్డ్ డైలాగ్స్‌, కాన్సెప్ట్‌తో పాటు హీరోయిజాన్ని ఆవిష్క‌రించిన తీరుపై బాలీవుడ్‌లోనూ చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సందీప్ వంగాను తెగ ట్రోల్ చేశారు. ఈ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. బాలీవుడ్‌లో సందీప్ వంగాకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.2019లో థియేట‌ర్ల‌లో రిలీజైన క‌బీర్‌సింగ్ ఆ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అంతే కాకుండా 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న ఫ‌స్ట్ ఏ రేటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.క‌బీర్‌సింగ్ త‌ర్వాత యానిమ‌ల్‌తో బాలీవుడ్‌లో సందీప్ వంగా పేరు మారుమోగింది.

స్పిరిట్ తో బిజీ...

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు సందీప్ వంగా. డార్క్ హ్యూమ‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే స్పిరిట్‌ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. స్పిరిట్‌లో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌తో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. స్పిరిట్ మూవీ తెలుగు, హిందీతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement