Veta Movie | చిరంజీవి టైటిల్‌తో కమిటీ కుర్రాళ్లు హీరో మూవీ – నాగబాబు గెస్ట్‌గా లాంఛ్
చిరంజీవి వేట మూవీ టైటిల్‌తో ఓ సినిమా రాబోతుంది. కమిటీ కుర్రాళ్లు ఫేమ్ సందీప్ సరోజ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ సోమవారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ మూవీ ఓపెనింగ్ వేడుకకు ఏపీ గ్రీన్ బోర్డ్ ఛైర్మన్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాత్విక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Aug 31, 2026, 6.34 pm IST
Veta Movie | చిరంజీవి కెరీర్‌లో వేట వైవిధ్యమైన సినిమాగా నిలిచింది. ఈ మెగాస్టార్ మూవీ టైటిల్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత ఓ కొత్త సినిమా రాబోతుంది. కమిటీ కుర్రాళ్లు ఫేమ్ సందీప్ సరోజ్ హీరోగా నటిస్తోన్న వేట మూవీ సోమవారం హైదరాబాద్‌లో అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. అశోక్ కోటిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాత్విక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈటీవీ విన్‌తో కలిసి ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేట మూవీ ఓపెనింగ్ వేడుకకు ఏపీ గ్రీన్ బోర్డ్ ఛైర్మన్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకనిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కేఎస్ రవికుమార్ క్లాప్ నిచ్చారు.
చిరంజీవి టైటిల్...
ఈ వేడుకలో హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ చిరంజీవి టైటిల్ కావాలని క్రేజ్ కోసం పెట్టలేదు. కథకు యాప్ట్ కావడంతోనే ఈ పేరు ఖరారు చేశాం. కమిటీ కుర్రాళ్లుతో పోలిస్తే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరోగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ అవుతుంది అని అన్నారు. ఈ సినిమాలో పెదరాయుడు తరహా పాత్ర చేస్తున్నానని, జెన్‌జీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ కేఎస్ రవికుమార్ చెప్పారు.
విలేజ్ ఎంటర్‌టైనర్...
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ కుమిటీ కుర్రాళ్లు తరహాలోనే విలేజ్ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగుతుంది. రా అండ్ రస్టిక్ ఎమోషన్స్‌తో దర్శకుడు అశోక్ చక్కటి కథను సిద్ధం చేశారు. ఈటీవీ విన్‌తో కలిసి మేము చేస్తోన్న మూడో మూవీ ఇది. నిహారిక కొణిదెల సపోర్ట్‌తోనే ఈ సినిమా చేస్తున్నాం అని పేర్కొన్నారు.
చైతన్ భరద్వాజ్...
వేట సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ కోటిపల్లికి డైరెక్టర్‌గా ఇదే మొదటి మూవీ. సోమవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. వేట మూవీ ప్రారంభోత్సవ వేడుకలో వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయిరాజేష్ ఎస్‌కేఎన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
సెప్టెంబర్ 13, 2026

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
సెప్టెంబర్ 13, 2026

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు

Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం



