Sandeep Reddy Vanga | స్పిరిట్ డైరెక్టర్ మ్యాడ్ హీరోయిన్‌తో రోమాంచకం
స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగా ప్రొడ్యూసర్‌గా మారాడు. తెలుగులో మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ సినిమా చేయబోతున్నాడు. రోమాంచకం పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు.
Entertainment | Published On May 29, 2026, 5.51 pm IST
Sandeep Reddy Vanga | అర్జున్ రెడ్డి, యానిమల్ బ్లాక్‌బస్టర్స్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు సందీప్ వంగా. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తోన్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో భారీగా హైప్ నెలకొంది. స్పిరిట్ సెట్స్‌పైకి ఉండగానే కొత్త సినిమాను అనౌన్స్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు సందీప్ వంగా. అయితే డైరెక్టర్‌గా కాదు. ప్రొడ్యూసర్‌గా ఓ చిన్న సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో పాటు హీరోహీరోయిన్లు ఎవరన్నది శుక్రవారం సందీప్ వంగా రివీల్ చేశాడు.
రోమాంచకం...
ఈ సినిమాకు రోమాంచకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు టైటిల్ పోస్టర్‌లో ఓ అమ్మాయి చిటికే వేస్తూ కనిపిస్తోంది. ఆమె వేళ్లపైన లవ్ సింబల్ కనిపిస్తోంది. రోమాంచకం సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ వంగా సమర్పణలో ప్రణయ్ వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...
మ్యూజికల్ రొమాంటిక్ కామెడీగా రొమాంచకం రూపొందనున్నట్లు సందీప్ వంగా ప్రకటించారు. దర్శకుడు కథ చెబుతున్నంత సేపు ఆగకుండా నవ్వుతూనే ఉండిపోయానని, ఫన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. రోమాంచకం సినిమాకు వాసుకీ వైభవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఓటీటీ డీల్ క్లోజ్...
షూటింగ్ మొదలుకాకముందే రోమాంచకం ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగులో మ్యాడ్, 8 వసంతాలు సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అనంతిక సనీల్ కుమార్. మరోవైపు మేము ఫేమస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. ఇటీవలే గోదారి గట్టుపైన పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేశాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






