త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samyuktha | గ‌న్ను ప‌ట్టిన సంయుక్త – యాక్ష‌న్ మూవీకి ప్యాక‌ప్ చెప్పిన మ‌ల‌యాళ బ్యూటీ

తెలుగులో సంయుక్త మీన‌న్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ది బ్లాక్‌గోల్డ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు యోగేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో సంయుక్త పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

N

Entertainment | Published On Apr 27, 2026, 5.26 pm IST

Samyuktha | గ‌న్ను ప‌ట్టిన సంయుక్త –  యాక్ష‌న్ మూవీకి ప్యాక‌ప్ చెప్పిన మ‌ల‌యాళ బ్యూటీ
Advertisement

Samyuktha | ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోయిన్లు ఫిమేల్ సెంట్రిక్ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు రెడీ అవుతోన్నారు. మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్త మీన‌న్ తెలుగులో ఫ‌స్ట్ టైమ్ ఓ మ‌హిళా ప్ర‌ధాన సినిమా చేస్తోంది. బ్లాక్ గోల్డ్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు చింత‌కాయ‌ల ర‌వి ఫేమ్ యోగేష్ కేఎంసీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో...

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ది బ్లాక్ గోల్డ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో ది బ్లాక్‌గోల్డ్‌ మూవీ క‌థ సాగుతుంద‌ట‌. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ మోసాల‌తో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ద‌ర్శ‌కుడు యోగేష్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

పోలీస్ ఆఫీస‌ర్‌గా...

ఈ యాక్ష‌న్ మూవీలో సంయుక్త పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. చ‌ట్టాన్ని కాపాడ‌టం కోసం అవ‌స‌ర‌మైతే గ‌న్‌కు ప‌నిచెప్ప‌డంలో త‌ప్పులేద‌ని భావించే పోలీస్‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సంయుక్త క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ట‌. తాజాగా రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనినింయింది, బొగ్గు గ‌నుల్లో సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా నిలబడి, చేతిలో గన్‌ను పట్టుకుని ఉన్న పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

తెలంగాణ‌లో..

ది బ్లాక్‌గోల్డ్ మూవీ షూటింగ్ మొత్తం తెలంగాణ‌లోనే సాగిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్ తో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో కేవ‌లం అర‌వై రోజుల్లోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించార‌ట‌. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ‌లో ఒక్కోసారి ఐదు కెమెరాలను వాడిన‌ట్లు చెప్పారు.

ఐదు భాష‌ల్లో...

బ్లాక్ గోల్డ్ మూవీలో మురళీ శర్మ, రావు రమేష్, నాజ‌ర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement