త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sampoornesh Babu | కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ ఈ సినిమాకే తీసుకున్నా – ప్యార‌డైజ్‌పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్‌

నాని ప్యార‌డైజ్ మూవీలో సంపూర్ణేష్‌బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా కామెడీ రోల్స్‌లో క‌నిపించిన సంపూర్ణేష్‌బాబు ప్యార‌డైజ్‌లో మాత్రం సీరియ‌స్ పాత్ర చేశారు. త‌న పాత్ర గురించి... నానితో సినిమా జ‌ర్నీ గురించి సంపూర్ణేష్‌బాబు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

N

Entertainment | Published On Sep 15, 2026, 7.14 pm IST

Sampoornesh Babu | కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ ఈ సినిమాకే తీసుకున్నా – ప్యార‌డైజ్‌పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్‌
Advertisement

Sampoornesh Babu | నాని హీరోగా న‌టించిన ప్యార‌డైజ్ మూవీ సెప్టెంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల్లో ప్యార‌డైజ్‌పైనే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ ప్యార‌డైజ్‌కే తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్యార‌డైజ్ గురించి సంపూర్ణేష్‌బాబు ఏం చెప్పారంటే?

బిర్యానీ...

ప్యార‌డైజ్‌లో బిర్యానీ క్యారెక్ట‌ర్ చేశారు. నాని బెస్ట్ ఫ్రెండ్‌గా క‌నిపిస్తా. హీరోతో పాటు సినిమా మొత్తం నా క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంది. ఓ రోజు డైరెక్ట‌ర్‌ శ్రీకాంత్ నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను ఎక్కువ‌గా కామెడీ రోల్స్‌లోనే క‌నిపించా. ఆ పంథాకు భిన్నంగా ఇందులో నా పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. న‌టుడిగా న‌న్ను కొత్త‌గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసే మూవీ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగింది. మూడునాలుగేళ్ల క్రితం నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్ లో కొన్ని త‌ప్పులు జ‌రిగి ఉండేవి కావు.

నాని డెడికేష‌న్ అద్భుతం...

బ‌డ్జెట్‌, మేకింగ్ ప‌రంగా కూడా నా సినీ జ‌ర్నీలో ఇదే పెద్ద మూవీ. షూటింగ్‌లో హీరో నాని నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. పెద్ద సినిమాలో ఎక్కువ‌ రోజులు పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. షూటింగ్ సెట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని డెడికేషన్ అద్భుతం. నేను ఏదైనా సీన్ బాగా చేస్తే మెచ్చుకునేవారు.

రిజెక్ట్ చేశా...

బేబీ డైరెక్ట‌ర్ సాయి రాజేష్ వ‌ల్లే ప్యార‌డైజ్‌లో నాకు అవ‌కాశం వ‌చ్చింది. ప్యార‌డైజ్ గురించి నీ కెరీర్‌లో ఓ మంచి సినిమా అవుతుంది వ‌ద‌లుకోకు అని చెప్పారు. బిర్యానీ పాత్ర‌ కోసం బరువు తగ్గమని డైరెక్ట‌ర్ చెప్పారు. తగ్గాను. అలాగే జట్టు గడ్డం కూడా పెంచాను. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. ప్యార‌డైజ్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఇత‌ర సినిమాలేవి చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నాను. కొన్ని అవకాశాలు వ‌చ్చాయి. కానీ వాటిని రిజెక్ట్ చేశా. రెమ్యూనరేషన్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు అన్నిటికంటే  ఎక్కువ రెమ్యూనరేషన్ ప్యారడైజ్ మూవీ కోసమే తీసుకున్నా...అని సంపూర్ణేష్ బాబు అన్నారు.

 

Advertisement
Advertisement