Samantha | హోస్ట్‌గా సమంత కొత్త అవతారం – తమిళంలో సెలిబ్రిటీ టాక్ షో
మా ఇంటి బంగారం సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సమంత హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తబోతుంది. ఓటీటీలో సెలిబ్రిటీ టాక్ షో చేయబోతుంది. సమంత టాక్ షో సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Jul 4, 2026, 3.01 pm IST
Samantha | మా ఇంటి బంగారంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది సమంత. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ మూవీగా 92 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఓటీటీలో...
ఈ బ్లాక్‌బస్టర్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సమంత తాజాగా హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తబోతుంది. తెలుగులో కాకుండా మాతృభాష తమిళంలో సెలిబ్రిటీ టాక్ షో చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో సమంత టాక్ షో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఓటీటీ షోపై సోనీలివ్ హింట్ ఇచ్చేసింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ఫిమేల్ సెలిబ్రిటీలు...
గతంలో వచ్చిన సెలిబ్రిటీ టాక్ షోలకు భిన్నంగా ఈ ఓటీటీ షో ఉండబోతున్నట్లు సమాచారం. కేవలం ఫిమేల్ సెలిబ్రిటీలు మాత్రమే సమంత టాక్ షోకు గెస్ట్‌లుగా రానున్నారట. హీరోయిన్లు, డైరెక్టర్లతో పాటు ఇండస్ట్రీలో ఇతర విభాగాల్లో పనిచేసే ఫిమేల్ టెక్నీషియన్ల వ్యక్తిగత జీవితం, తెర వెనుక వారు పడే కష్టాన్ని ఈ షో ద్వారా వెల్లడించబోతున్నట్లు సమాచారం.
గెస్ట్‌లు ఫైనల్...
ఆగస్ట్ నుంచి సోనీలివ్‌లో సమంత టాక్ షో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కొందరు గెస్ట్‌లను ఫైనల్ చేశారట. వారి ఎపిసోడ్స్ తాలూకు షూటింగ్ జూలైలోనే జరుగనుందట.
టాక్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించడం ఇది రెండో సారి. గతంలో సామ్ జామ్ పేరుతో తెలుగులో ఓ షో చేసింది. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ టాక్ షోకు చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ గెస్ట్‌లుగా వచ్చారు.
గుడ్‌న్యూస్...
ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది సమంత. మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో ఈ గుడ్‌న్యూస్ వినిపించింది. ప్రెగ్నెన్సీ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుండట సమంత. ఈ గ్యాప్‌లోనే ఈ టాక్ షో ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా మా మా ఇంటి బంగారం సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా నిర్మించింది. ఈ సినిమాతో సమంతకు యాభై కోట్లకుపైనే లాభాలు వచ్చినట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Bhutan Rejects Indian Fuel | ఇండియా E20 పెట్రోల్ మాకొద్దు.. భారత్ ఆయిల్ కంపెనీల ఆఫర్‌ను తిరస్కరించిన భూటాన్!
- ●Car Insurance | వరదలో కారు మునిగిందా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను తిరస్కరిస్తారు, జాగ్రత్త..
- ●KTR | రేపు కన్నేపల్లికి కేటీఆర్
- ●Rythu Bharosa | కొనసాగుతోన్న రైతు భరోసా నిధులు విడుదల.. ఇప్పటి వరకు 7135.77 కోట్లు జమ
- ●Monsoon session | జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం

Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhutan Rejects Indian Fuel | ఇండియా E20 పెట్రోల్ మాకొద్దు.. భారత్ ఆయిల్ కంపెనీల ఆఫర్‌ను తిరస్కరించిన భూటాన్!

Car Insurance | వరదలో కారు మునిగిందా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను తిరస్కరిస్తారు, జాగ్రత్త..

KTR | రేపు కన్నేపల్లికి కేటీఆర్






