త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | క‌ల‌లో ఊహించ‌లేదు – రాష్ట్ర‌ప‌తి విందులో స‌మంత – ఫొటోలు వైర‌ల్‌

రిప‌బ్లిక్ డే రోజు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇచ్చిన తేనీటి విందులో స‌మంత పాల్గొన్న‌ది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ స్థాయికి చేరుకుంటాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

N

Entertainment | Published On Jan 27, 2026, 5.39 pm IST

Samantha | క‌ల‌లో ఊహించ‌లేదు – రాష్ట్ర‌ప‌తి విందులో స‌మంత – ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Samantha | టాలీవుడ్ హీరోయిన్ స‌మంత అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను సంద‌ర్శించింది. ఇక్క‌డికి వ‌స్తాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రిప‌బ్లిక్ డే రోజున రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇచ్చిన తేనీటి విందుకు ఈ ఏడాది స‌మంత‌కు ఆహ్వానం అందింది. సోమ‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోని మొఘ‌ల్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఎట్‌హోమ్ కార్య‌క్ర‌మంలో స‌మంత పాల్గొన్న‌ది. టాలీవుడ్ నుంచి ఈ వేడుక‌లో పాల్గొన్న ఏకైన సినిమా న‌టిగా స‌మంత నిలిచింది.

ఎమోష‌న‌ల్ పోస్ట్‌...

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో దిగిన ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది స‌మంత‌. ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వ‌స్తాన‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని అన్న‌ది. "జీవితంలో ముందుకు సాగుతున్న‌ప్పుడు నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు... నేను ఈ స్థాయికి చేరుకుంటానని నా అంత‌రాత్మ కూడా ఎప్పుడూ అనుకోలేదు. నా కంటూ మార్గ‌ద‌ర్శి ఎవ‌రూ లేరు. రోడ్ మ్యాప్‌లు లాంటివి లేవు. ఇలాంటి కలలు ఒక‌ప్పుడు పెద్ద‌విగా అనిపించేవి. కానీ నేను నా ప్ర‌య‌త్నాలు మాత్రం ఆపలేదు. నా లాంటి ఓ సామాన్యురాలి ప్ర‌యాణానికి గుర్తింపునిచ్చే ఈ దేశంలో ఉండటమే నా అదృష్టం" అంటూ స‌మంత త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది. ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ప‌లువురు నెటిజ‌న్లు స‌మంత‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎంతో మందికి సామ్ స్ఫూర్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్ ప్ర‌ముఖులు...

కాగా రాష్ట్ర‌ప‌తి ఇచ్చిన ఈ తేనీటి విందులో స‌మంత‌తో పాటు ర‌ణ‌బీర్‌క‌పూర్‌, ఆదిత్య ధ‌ర్‌, యామీ గౌత‌మ్‌తో పాటు మ‌రికొంద‌రు బాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొన్న‌ట్లు స‌మాచారం.
ప్ర‌స్తుతం స‌మంత మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వేస‌విలో రిలీజ్ కాబోతుంది. హిందీలో స‌మంత లీడ్ రోల్‌లో న‌టించిన ర‌క్త్ బ్ర‌హ్మాండ్ సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement

తాజావార్తలు

Advertisement