త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో – అస‌లేం జ‌రిగిందంటే?

కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ డీసీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శుక్ర‌వారం రిలీజైన ఈ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీలో హీరోగా ఫ‌స్ట్ చాయిస్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కాదు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా చేయాల్సింది.

N

Entertainment | Published On Aug 8, 2026, 7.45 pm IST

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో – అస‌లేం జ‌రిగిందంటే?
Advertisement

Vijay Deverakonda | లోకేష్ క‌న‌గ‌రాజ్ డీసీ మూవీ శుక్ర‌వారం త‌మిళంతో పాటు తెలుగులో రిలీజైంది. యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాతోనే లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా అరంగేట్రం చేశాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా అద‌ర‌గొట్టేశాడంటూ ప్ర‌శంస‌లు వినిపిస్తున్నాయి. రా అండ్ ర‌స్టిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా త‌మిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌....

లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు వామికా గ‌బ్బి ప‌ర్ఫార్మెన్స్‌, అనిరుధ్ బీజీఎమ్, డైరెక్ట‌ర్ అరుణ్ మాథేశ్వ‌ర‌న్ టేకింగ్ అద్భుతమంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే డీసీ మూవీలో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కాదు. టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా చేయాల్సింది.

కింగ్డ‌మ్‌....

డీసీ మూవీని ఉద్దేశించి పాత ఇంట‌ర్వ్యూలో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ అవుతోన్నాయి. కింగ్డ‌మ్‌ సినిమా చేస్తోన్న టైమ్‌లోనే అరుణ్ మాథేశ్వ‌ర‌న్ త‌న‌కు ఓ రా అండ్ ర‌స్టిక్ స్టోరీ చేస్తాడ‌ని విజ‌య్ అన్నాడు. కింగ్డ‌మ్ క‌థ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో....రెండు సేమ్ స్టోరీస్ అవుతాయ‌నే ఆలోచ‌న‌ల‌తో అరుణ్ మాథేశ్వ‌ర‌న్ సినిమాను రిజెక్ట్ చేశాన‌ని విజ‌య్ చెప్పాడు. డీసీ మూవీ గురించే విజ‌య్ చెప్పాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడ‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

మోడ్ర‌న్ దేవ‌దాసు....

దేవ‌దాస్ క‌థ‌ను మోడ్ర‌నైజ్ చేసి ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వ‌ర‌న్ డీసీ మూవీని తెర‌కెక్కించారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌పై తిరుగుబాటు చేసిన ఓ యువ‌కుడి జీవితంలోకి ఓ వేశ్య ఎలా ప్ర‌వేశించింది? ఆమె ప‌రిచ‌యం త‌ర్వాత అత‌డి జీవితం ఎలా మారింది? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

రౌడీ జ‌నార్ధ‌న‌, ర‌ణ‌బాలి...

ప్ర‌స్తుతం తెలుగులో రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు ర‌ణ‌బాలి సినిమాలు చేస్తోన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. వీటితో పాటు హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథాల‌జీ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

Advertisement
Advertisement