Trisha | అన్నతో విభేదాలు – తమ్ముడితో సినిమా – త్రిష నిర్ణయాలు ఊహాతీతం
కరుప్పు మూవీ ప్రమోషన్స్‌లో సూర్య, త్రిష మధ్య ఏర్పడిన విభేదాలు కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. సూర్యతో గొడవల కారణంగానే ఈ సినిమా ప్రమోషన్స్‌కు త్రిష దూరంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ విభేదాలపై క్లారిటీ రాకముందే సూర్య తమ్ముడు కార్తీతో త్రిష ఓ కొత్త సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Entertainment | Published On Aug 9, 2026, 2.12 pm IST
Trisha | కరుప్పు మూవీతో పెద్ద హిట్టును తన ఖాతాలో వేసుకుంది చెన్నై క్వీన్ త్రిష. సూర్య హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సూర్య పరాజయాల పరంపరకు ఈ సినిమాతోనే బ్రేక్ పడింది.
కోల్డ్ వార్....
కరుప్పు ప్రమోషన్స్‌లో సూర్య, త్రిష మధ్య కోల్డ్ వార్ నడిచినట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు త్రిష అటెండ్ కాలేదు. తను సినిమాలో నటించిన విషయం మేకర్స్ మరచిపోయినట్లు ఉన్నారంటూ నిర్మాతలపై త్రిష డైరెక్ట్‌గానే కౌంటర్లు వేసింది. ప్రమోషన్స్‌లో త్రిష పేరును సూర్య ఎక్కడ చెప్పలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె పేరును ప్రస్తావించకుండా అవైయిడ్ చేయడం ఆసక్తికరంగా మారింది. కరుప్పు బ్లాక్‌బస్టర్‌తో అందరిని కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చాడు సూర్య. కానీ త్రిషను మాత్రం కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత తగ్గించడం, ప్రమోషనల్ ఈవెంట్లకు దూరం పెట్టడానికి సూర్యనే కారణమంటూ త్రిష ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోసారి సూర్యతో కలిసి సినిమా చేయకూడదని చెన్నై క్వీన్ నిర్ణయించుకుందంటూ వార్తలొచ్చాయి.
పాన్ ఇండియన్ మూవీ...
కరుప్పు తర్వాత కొత్త కథలు చాలానే విన్న త్రిష ఇటీవలే ఓ పాన్ ఇండియన్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సూర్య తమ్ముడు కార్తీతో జోడీకట్టబోతున్నట్లు సమాచారం. అన్న సూర్యతో విభేదాలపై క్లారిటీ రాకముందే తమ్ముడి కార్తీతో సినిమా చేయడానికి త్రిష అంగీకరించడం కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది. త్రిష నిర్ణయాలు ఊహాతీతం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నయనతార అనుకొని....
కార్తీ, త్రిష మూవీకి హనుమాన్ జంక్షన్, గాడ్‌ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. తొలుత ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ పలు భాషల సినిమాలో నయన్ బిజీగా ఉండటంతో ఈ ఛాన్స్ త్రిషకు దక్కినట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తీ, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Deverakonda | డీసీ మూవీని మిస్ చేసుకున్న తెలుగు హీరో – అసలేం జరిగిందంటే?
ఆగస్టు 8, 2026

DC Review | డీసీ రివ్యూ – మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? – హీరోగా హిట్టు కొట్టాడా?
ఆగస్టు 7, 2026

Chinmayi | జయలలితనూ అవమానించారు – త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, ఖుష్బూ డిమాండ్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
- ●SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?
- ●Vijay Devarakonda | లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
- ●KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు
- ●Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు
- ●Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ - నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్

Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా

SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?

Vijay Devarakonda | లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు



