DC Review | డీసీ రివ్యూ – మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? – హీరోగా హిట్టు కొట్టాడా?
డీసీ మూవీతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Aug 7, 2026, 7.58 pm IST
DC Review | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీ శుక్రవారం తెలుగుతో పాటు తమిళంలో రిలీజైంది. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. డెబ్యూ మూవీతో హీరోగా లోకేష్ కనగరాజ్ హిట్టు కొట్టాడా? డీసీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?
దేవదాస్...చంద్ర
సర్కార్ పోలీస్‌గా పనిచేసి ఆ వ్యవస్థలోని అవినీతి నచ్చక తిరుగుబాటు చేస్తాడు. సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటుచేసి గన్‌తో న్యాయం చేస్తుంటాడు. అతడి గ్యాంగ్‌లో దేవదాస్ (లోకేష్ కనగరాజ్), కిట్టీ, నరసింహా, సెబాస్టియన్ సభ్యులుగా ఉంటారు. కొడుకు చదువు కోసం పొలాన్ని అమ్మిన పేదవాడికి ఓ ఎస్ఐ అన్యాయం చేస్తాడు. అతడిని దేవదాస్ చంపేస్తాడు. దాంతో పోలీసుల దృష్టిలో సర్కార్, దేవదాస్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతుంది. వారిని పట్టుకోవడానికి భోజరాజు (గురు సోమసుందరం) అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. విజయవాడలోని ఓ బార్‌లో తలదాచుకుంటారు. అక్కడ పార్వతి అనేసింగర్‌తో దేవదాస్ ప్రేమలో ప్రేమలో పడతాడు. దేవదాస్ పై జరిపిన ఎటాక్‌లో భోజరాజ్ పార్వతిని చంపేస్తాడు. బార్ ఓనర్ తమ గురించి పోలీసులకు చెప్పాడని భావించిన దేవదాస్ అతడిని చంపేందుకు స్కెచ్ వేస్తాడు. ఓ వేశ్యగృహంలో ఉన్న అతడిని దారుణంగా హతమారుస్తాడు. అక్కడే దేవదాస్‌కు వేశ్యగా పనిచేసే చంద్ర (వామికా గబ్బి) పరిచయమవుతుంది. తనకు స్వేచ్ఛజీవితాన్ని ప్రసాదించిన దేవదాస్‌ను చంద్ర ఇష్టపడుతుంది. అతడిని పోలీసులు పట్టుకుంటే..స్టేషన్‌పైనే ఎటాక్ చేసి విడిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చంద్ర ప్రేమను దాస్ అర్థం చేసుకున్నాడా? దాస్ గ్యాంగ్‌లోని అందరిని భోజరాజ్ ఎలా చంపాడు? తన వారి చావుపై చంద్రతో కలిసి దాస్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే మూవీ కథ.
గ్యాంగ్‌స్టర్...వేశ్య...
ప్రేమ కోసం అన్వేషించే ఓ గ్యాంగ్‌స్టర్....అతడి ప్రతి అడుగులో ప్రమాదమే పొంచి ఉంటుంది. పద్దెనిమిదేళ్లు ఒకే గదిలో బందీగా మారిపోయి బయటి ప్రపంచమే ఒకటి ఉందని మరచిపోయిన వేశ్య.. అనుకోకుండా కలిసిన బంధం...ఎలా విడదీయరానంతగా మారింది అన్నదే డీసీ మూవీ కథ. అంతులేని బాధ, ఆవేదనతో నిండిపోయిన రెండు హృదయాల్లో ప్రేమ కొత్త ఊపిరిని ఎలా నింపింది అన్నది చాలా పొయెటిక్‌గా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు.
పోలీస్ వ్యవస్థలోని అవినీతి, బూటకపు ఎన్‌కౌంటర్లు, వేశ్యవాటికల్లో అమ్మాయిలు అనుభవించే వ్యథలు పలు సామాజికాంశాలను ఈ సినిమాలో టచ్ చేశారు డైరెక్టర్. కానీ అవన్నీ హీరో జర్నీలో ఓ భాగంగానే వస్తాయి తప్పితే అవే మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌గా ఉండవు. సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించలేదు.
మోడ్రన్ దేవదాసు...
దేవదాస్ కథను చాలా మోడ్రన్ స్టైల్‌లో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్. ఒరిజినల్‌లో పార్వతి ప్రేమకు దూరమైన దేవదాస్ చివరకు ప్రాణాలు కోల్పోతాడు. విషాదాంతంగా అతడి జీవితం ముగుస్తుంది. కానీ అరుణ్ మాథేశ్వరన్ కథలో పార్వతికి దూరమైన దేవదాస్ ఆ ప్రేమను చంద్ర రూపంలో తిరిగి పొందుతాడు. ఆమెతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టి దేవదాస్ లైఫ్‌ను సుఖాంతం చేశారు. పార్వతి పాత్రను మోడ్రనైజ్ చేసిన తీరు కూడా కొత్తగా ఉంది. సిగరెట్ తాగుతూ ఎన్ని కష్టాలు ఎదురైన ధైర్యంగా ముందడుగు వేసే అమ్మాయిగా ప్రజెంట్ చేశారు. ఓ కుంటివాడిని ఎదురించలేక పద్దెనిమిదేళ్లు కష్టాలు పడిన చంద్ర....తాను ఇష్టపడిన దేవదాస్ కోసం పోలీస్ స్టేషన్‌పైనే ఎటాక్ చేయడానికి సిద్ధమవుతుంది....ప్రేమ ఆమెలో తెచ్చిన మార్పును దర్శకుడు హృద్యంగా సినిమాలో చూపించాడు.
సింబాలిక్ షాట్స్...
ఓ మోటార్ మెకానిక్ కథతో సినిమా మొదలుపెట్టి....క్లైమాక్స్‌లో అతడి పాత్రను హీరోకు లింక్ చేసిన విధానం భలేగా ఉంటుంది. వేశ్యవాటిక నుంచి బంధవిముక్తురాలై మొదటిసారి లోకాన్ని చూసి తన్మయత్వంతో మురిసిపోయే సీన్...ఎప్పుడూ చేతిలో ప్లాస్టిక్ గులాబీ పట్టుకొని...తన జీవితం అలాంటిదే అని హీరోయిన్ పదే పదే సింబాలిక్‌గా చెప్పడం...ఇలాంటి షాట్స్‌తో దర్శకుడు మెస్మరైజ్ చేశాడు. హీరోహీరోయిన్ల ప్రేమకథలో ఒక్క బూతు డైలాగ్, లిప్‌లాక్ కూడా ఉండవు.
మిగిలిన ట్రాక్ మైనస్...
లవ్‌స్టోరీ వరకు బాగుంది. కానీ మిగిలిన ట్రాక్ దారి తెన్నూ లేకుండా సాగిపోతుంది. ఓ పేద పిల్లాడికి హీరో సాయం చేయాలని అనుకోవడం, డబ్బు కోసం అతడు చేసే ప్రయత్నాలు సిల్లీగా ఉన్నాయి. రిపీటెడ్ సీన్లతో ఆ ట్రాక్ మొత్తం బోర్ కొట్టిస్తుంది. బోజరాజ్ ఎటాక్స్ నుంచి దేవదాస్, చంద్ర తప్పించుకునే సీన్లు లాజిక్‌లెస్ గా ఉన్నాయి. అసలు హీరో పోరాటం ఎందుకు? పోలీసులను అతడు ఎందుకు అంతలా ద్వేషిస్తున్నాడు అన్నది సరిగ్గా చూపించలేదు.
రా అండ్ రస్టిక్...
లోకేష్ కనగరాజ్ డెబ్యూ మూవీ అంటే నమ్మలేం. అంతగా హీరో పాత్రలో జీవించాడు. దేవదాస్ పాత్రలో రా అండ్ రస్టిక్ యాక్టింగ్‌ను కనబరిచాడు. యాక్షన్ సీన్లలో మెప్పించాడు. నటనలో లోకేష్ కనగరాజ్‌ను మించిపోయింది వామికా గబ్బి. వేశ్య అంటే బోల్డ్‌గా చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో మాత్రం రెబెల్‌లా వామికా గబ్బి క్యారెక్టర్ సాగుతుంది. చంద్ర పాత్రలో ఆమె నటన నెక్స్ట్ లెవెల్. ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. గురు సోమసుందరంతో పాటు మిగిలిన వారి నటన బాగుంది.
అనిరుధ్ మ్యూజిక్...
అనిరుధ్ మ్యూజిక్ అంటేనే థియేటర్లలో బాక్సులు బద్దలైపోతాయి. కానీ తన రొటీన్ స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాకు సంగీతం అందించాడు. తన బీజీఎమ్‌తోనే చాలా ఎమోషన్స్ పలకించాడు. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అనిరుధ్ మ్యూజిక్‌తోనే ఎక్కువగా కథను చెప్పాడు.
వెరైటీ లవ్‌స్టోరీ
డీసీ ఓ వెరైటీ లవ్‌స్టోరీ. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి యాక్టింగ్ కోసం చూడొచ్చు. తమిళ వాసనలు ఎక్కువ కావడం, లోకేష్ కనగరాజ్ మినహా తెలిసిన నటులు లేకపోవడంతో మైనస్‌గా మారింది.
సంబంధిత వార్తలు

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ – ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు – తెలుగులో స్ట్రీమింగ్
ఆగస్టు 3, 2026

Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ – పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
ఆగస్టు 3, 2026

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం



