త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi – Samantha | తెలుగు డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా సాయిప‌ల్ల‌వి – జ‌డ్జ్‌గా స‌మంత – ఓల్డ్ వీడియో చూశారా?

హీరోయిన్‌గా మార‌క‌ముందు సాయిప‌ల్ల‌వి కొన్ని టీవీ షోస్‌లో పాల్గొన్న‌ది. అందులో ఓ తెలుగు టీవీ షో కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో సీజ‌న్ 4లో ఓ కంటెస్టెంట్‌గా క‌నిపించింది సాయిప‌ల్ల‌వి. ఆ సీజ‌న్‌లో ఓ ఎపిసోడ్‌కు స‌మంత గెస్ట్‌గా రావ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On May 9, 2026, 7.37 pm IST

Sai Pallavi – Samantha | తెలుగు డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా సాయిప‌ల్ల‌వి – జ‌డ్జ్‌గా స‌మంత – ఓల్డ్ వీడియో చూశారా?
Advertisement

Sai Pallavi - Samantha | హీరోయిన్ల‌కు అంద‌మే ప్ర‌ధాన క్వాలిఫికేష‌న్ అనే అపోహ ఉండేది. గ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన వారికే అవ‌కాశాలు వ‌స్తాయ‌ని అనుకునేవారు. ఈ రూల్‌ను తిర‌గ‌రాసింది సాయిప‌ల్ల‌వి. యాక్టింగ్ టాలెంట్‌తో నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకోవ‌చ్చ‌ని నిరూపించింది. సాయిప‌ల్ల‌వి ఓ సినిమా అంగీక‌రించిందంటే ఆ సినిమా హిట్టేన‌ని ఫ్యాన్స్ ఫిక్సైపోతుంటారు. ఈ నాచుర‌ల్ బ్యూటీ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే తెలుగు, త‌మిళం అనే భేదాలు లేకుండా అన్ని భాష‌ల ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఏ పాత్ర చేసినా అందులో పూర్తిగా ఒదిగిపోతుంటుంది సాయిప‌ల్ల‌వి. తాను కాకుండా ఆ పాత్ర మాత్ర‌మే క‌నిపించేలా క‌ష్ట‌ప‌డుతుంది. ఇటీవ‌లే ఈ నాచుర‌ల్ బ్యూటీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సాయిప‌ల్ల‌వి.

ఢీ డ్యాన్స్ షో...

స్వ‌త‌హాగా సాయిప‌ల్ల‌వికి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ మ‌క్కువ‌తోనే సినిమాల్లోకి రాక‌ముందు కొన్ని డ్యాన్స్ బేసెడ్ టీవీ షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. అందులో ఓ తెలుగు టీవీ షో కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో సీజ‌న్ 4లో ఓ కంటెస్టెంట్‌గా క‌నిపించింది సాయిప‌ల్ల‌వి. త‌న డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన ఈ బ్యూటీ ఏకంగా ఫైన‌ల్ చేరుకుంది. కానీ టైటిల్ మాత్రం గెల‌వ‌లేక‌పోయింది.

స‌మంత గెస్ట్‌....

సాయిప‌ల్ల‌వి కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఈ సీజ‌న్‌లో ఓ ఎపిసోడ్‌కు స‌మంత గెస్ట్ జ‌డ్జ్‌గా వ‌చ్చింది. సాయిప‌ల్ల‌వి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయిన సామ్‌..ఆమెపై తెగ‌ ప్ర‌శంస‌లు కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఢీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సాయిప‌ల్ల‌వి ఆ త‌ర్వాత ప్రేమ‌మ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో హిట్‌తో టాప్ స్టార్‌గా మారింది. ఆ త‌ర్వాత కాలంలో స‌మంత‌తోనే క‌లిసి ప‌లు అవార్డ్స్ ఈవెంట్‌లో స్టేజ్‌ను షేర్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

 

View this post on Instagram

 

A post shared by Telugu TV Updates (@telugutvupdates)

Advertisement
Advertisement