Rashmika Mandanna | కాక్‌టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం – సమంత సినిమాకు లాభాలు – రష్మిక సినిమాకు నష్టాలు
రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2తో పాటు సమంత తెలుగు క్రైమ్ కామెడీ సినిమా మా ఇంటి బంగారం ఒకే రోజు థియేటర్లలోకి వచ్చాయి. ఈ బాక్సాఫీస్ వార్‌లో రష్మిక సినిమాకు నష్టాలు రాగా...సమంత సినిమా లాభాలతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Jun 26, 2026, 7.17 pm IST
Rashmika Mandanna | గత వారం బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, సమంత తమ సినిమాలతో పోటీపడ్డారు. ఈ బాక్సాఫీస్ వార్‌లో సమంత విన్నర్‌గా నిలవగా...రష్మిక సినిమా నష్టాలతో డిసపాయింట్ చేసింది. జూన్ 19న సమంత తెలుగు మూవీ మా ఇంటి బంగారంతో పాటు రష్మిక మందన్న బాలీవుడ్ సినిమా కాక్ టెయిల్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
యాభై తొమ్మిది కోట్లు...
క్రైమ్ కామెడీగా రూపొందిన మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది. ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న మా ఇంటి బంగారం రిలీజై వారం రోజులు దాటినా హౌజ్‌ఫుల్స్‌తో అదరగొడుతోంది. తొలి వారంలో వరల్డ్ వైడ్‌గా ఈ తెలుగు సినిమా యాభై తొమ్మిది కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన మా ఇంటి బంగారం నిర్మాతలకు ఇప్పటివరకు పదిహేను కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. గురువారం రోజు కూడా 2.65 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మా ఇంటి బంగారం మూవీలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.
బ్లాక్‌బస్టర్ అనుకుంటే...
రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ మాత్రం రిలీజై వారం రోజులు దాటినా ఇప్పటికీ లాభాల్లోకి అడుగుపెట్టలేదు. వరల్డ్ వైడ్‌గా 110 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ వీక్‌లో 74 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ప్రాఫిట్ మార్క్‌ను టచ్ చేయాలంటే ఇంకో 36 కోట్లకుపైనే వసూళ్లను రావాల్సివుందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో కాక్ టెయిల్ 2 హిట్టు కావడం కష్టమేనని అంటున్నారు. ఓపెనింగ్ బాగానే వచ్చినా సినిమా కాన్సెప్ట్‌తో పాటు రష్మిక రోల్‌పై విమర్శలు రావడం మైనస్‌గా మారింది.
దీపికా పడుకోణ్ సినిమాకు సీక్వెల్
కాక్ టెయిల్ 2లో షాహిద్‌కపూర్ హీరోగా నటించగా...రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ మరో నాయికగా నటించింది. హోమీ అద్జానియా దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ మూవీకి సీక్వెల్‌గా ఈ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు – ఫొటోలు వైరల్
జూన్ 26, 2026

Varanasi Movie | వారణాసికి గుమ్మడికాయ కొట్టేది అప్పుడే – కిరాక్ అప్డేట్ చెప్పిన జక్కన్న
జూన్ 26, 2026

Nabha Natesh | అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెంగర్ల్ – మాస్ మహారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్
- ●TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- ●ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ
- ●Srinivas Goud | ఆర్ఎస్పీని చంపడానికే సెక్యూరిటీ తీసేశారు
- ●IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?

Bhatti Vikramarka | డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Keerthy Suresh | భర్తతో కలిసి శ్రీకాళహస్తిలో కీర్తి సురేష్ ప్రత్యేక పూజలు - ఫొటోలు వైరల్

TG Weather | తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ



