త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వ‌ర్సెస్ కాక్ టెయిల్ 2 – క‌లెక్ష‌న్స్‌లో స‌మంతను బీట్ చేసిన ర‌ష్మిక బాలీవుడ్ మూవీ

స‌మంత మా ఇంటి బంగారంతో పాటు ర‌ష్మిక మంద‌న్న కాక్ టెయిల్ 2 సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టాయి. మా ఇంటి బంగారం మొద‌టి రోజు 13.15 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోగా... ర‌ష్మిక బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇర‌వై నాలుగు కోట్ల‌తో కుమ్మేసింది.

N

Entertainment | Published On Jun 20, 2026, 2.43 pm IST

Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వ‌ర్సెస్ కాక్ టెయిల్ 2 –   క‌లెక్ష‌న్స్‌లో స‌మంతను బీట్ చేసిన ర‌ష్మిక బాలీవుడ్ మూవీ
Advertisement

Samantha vs Rashmika Mandanna |  టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు స‌మంత, ర‌ష్మిక మంద‌న్న ఒకే రోజు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ్డారు. స‌మంత హీరోయిన్‌గా న‌టించిన తెలుగు లేడీ ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారంతో పాటు ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ కాక్ టెయిల్ 2 శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు మొద‌టి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టాయి. ఇద్ద‌రి కెరీర్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాలుగా రికార్డులు నెల‌కొల్పా యి.

మా ఇంటి బంగారం....

స‌మంత మా ఇంటి బంగారం శుక్ర‌వారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 13.15 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌తో కూడిన ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ వారం రిలీజైన సినిమాల్లో మా ఇంటి బంగారంపై ఎక్కువ‌గా హైప్ ఉండ‌టం, పోటీగా పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం స‌మంతకు క‌లిసివ‌చ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్‌పై పెద్ద‌గా క‌నిపించ‌లేదు. రెండు రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.
ఈ సినిమాలో న‌క్స‌లైట్‌గా, త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే కోడ‌లిగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో స‌మంత అద‌ర‌గొట్టింది. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత ఈ సినిమాను నిర్మించింది.

కాక్ టెయిల్ 2 బాక్సాఫీస్ ర‌చ్చ‌....

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన కాక్ టెయిల్ 2 మొద‌టి రోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 24 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇండియాలో ఈ సినిమా 13 కోట్ల వ‌సూళ్లు రాగా ఓవ‌ర్‌సీస్‌లో 11 కోట్లు రాబ‌ట్టింది. రష్మిక బాలీవుడ్ కెరీర్ లో ఫస్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ వారం రిలీజైన హిందీ సినిమాల్లో కాక్ టెయిల్ 2కే ఎక్కువ‌గా ఆక్యుపెన్సీ న‌మోదు అయ్యింది. కాక్‌టెయిల్ 2లో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌గా...ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు మ‌రో నాయిక‌గా కృతి స‌న‌న్ క‌నిపించింది. షాహిద్‌, కృతి స‌న‌న్‌, ర‌ష్మిక కెమిస్ట్రీతో పాటు హీరోయిన్ల గ్లామ‌ర్ సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా ఉన్నాయంటూ కామెంట్లు వ‌స్తోన్నాయి.

 

Advertisement
Advertisement