Maa Inti Bangaram Review | మా ఇంటి బంగారం రివ్యూ – సమంత క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత. మా ఇంటి బంగారంతో మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Jun 19, 2026, 3.01 pm IST
Maa Inti Bangaram Review | సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఓ బేబీ డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ విజయం అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ మా ఇంటి బంగారం. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాను భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డిలతో కలిసి సమంత నిర్మించింది. శుక్రవారం రిలీజైన మా ఇంటి బంగారం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సమంతకు ఈ సినిమాతో హిట్టు దక్కిందా? లేదా? అంటే?
నక్సలైట్ కథ...
ఝాన్సీ (సమంత) మాజీ నక్సలైట్. తన గతాన్ని దాచిపెట్టి స్వర్ణ అనే మారు పేరుతో అనిరుధ్ (దిగంత్) అనే డాక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అనిరుధ్ తండ్రికి బల్లవరం ఊరిలో రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. తన ఇష్టానికి వ్యతిరేకతంగా పెళ్లి చేసుకున్న కొడుకు అనిరుధ్‌తో పాటు కోడలు స్వర్ణను ఇంటి నుంచి వెళ్లగొడతాడు. రెండేళ్ల తర్వాత చెల్లెలి పెళ్లి కోసం అనిరుధ్, స్వర్ణ సొంత ఊరికి వస్తారు. అత్తింటి వారిని మెప్పు కోసం స్వర్ణ ఎలాంటి కష్టాలు పడింది? తన గతం గురించి భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులకు తెలియకుండా ఏం చేసింది? ప్రజా ఉద్యమం పేరుతో అవినీతికి పాల్పడిన కరుణ(గుల్షన్ దేవయ్య)...స్వర్ణపై పగతో రగిలిపోవడానికి కారణమేమిటి? కరుణ బారి నుంచి తన అత్తింటివారిని స్వర్ణ ఎలా కాపాడుకుంది అన్నదే ఈ మూవీ కథ.
రొటీన్ ఫార్ములా...
హీరో ఫేమస్ క్రిమినల్....కానీ కుటుంబం కోసం తన గతాన్ని దాచిపెట్టి అజ్ఞాతంలో బతకడం అనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్, ఫ్యాక్షనిజం, మాఫియా.. రకరాకల జానర్లలో ఈ ఫార్ములాను వాడేశారు. మా ఇంటి బంగారం కూడా ఆ కోవకు చెందిన సినిమానే. హీరో కాకుండా హీరోయిన్ గతాన్ని దాచడం అన్నదే కొత్తది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్‌గా సాగుతుంది.
లాజిక్ లెస్...
తన భర్తతో కలిసి సమంత అత్తింట్లో అడుగుపెట్టే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ సన్నివేశం నుంచి ఇంచుకూడా ముందుకు కదలక ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడికక్కడే తిరుగుతూ బోర్ కొట్టిస్తుంది. అత్తింటి వారిని ఇంప్రెస్ చేయడానికి మరో ఊరిలో నుంచి తన స్నేహితురాలిని తీసుకొచ్చి ఆమె చేత దొంగతనంగా వంటలు చేయడం, ముగ్గులు వేయించడం లాంటి కామెడీ సీన్లతో నడిపించారు డైరెక్టర్. హీరోయిన్ మావయ్య సీఎంతో అనుబంధం కలిగిన పొలిటికల్ లీడర్. మరిది పెద్ద పోలీస్ ఆఫీసర్. పైగా ఉమ్మడి కుటుంబం. అంత మంది ఉన్న ఇంట్లో సమంత ఓ రౌడీని చంపేసి అతడి శవాన్నిఈజీగా మాయం చేయడం, ఊళ్లోకి వచ్చిన విలన్ మనుషులను తుక్కుతుక్కగా కొట్టిన ఎవరికి తెలియకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. పోనీ ఆ సీన్లను కన్వీన్సింగ్‌గా తీశారా అంటే అదీ లేదు. కామెడీ, ఎమోషన్స్ ఏవీ సరిగ్గా వర్కవుట్ కాలేదు.
నక్సలిజం....
కరుణ, స్వర్ణ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులతో సెకండాఫ్‌ను ఇంట్రెస్టింగ్‌గా నడిపించేందుకు స్కోప్ ఉంది. కానీ అలాంటి బలమైన సీన్ ఒక్కటి కూడా సినిమాలో కనిపించదు. విలన్ రావడం సుదీర్ఘంగా డైలాగ్స్ చెప్పడం తప్పితే చేసేదేమీ ఉండదు. నక్సలిజాన్ని ఎక్కువగా చూపిస్తే అనవసరపు కాంట్రవర్సీలు వస్తాయని అనుకున్నారో హడావిడిగా ఆ సీన్లను ముగించేశారు. ఇలా ఒకటేమిటి మా ఇంటి బంగారం అడుగడుగునా లోపాలు కనిపిస్తాయి.
ఈ సినిమా మొత్తంలో సమంత యాక్టింగ్ ఒక్కటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కెరీర్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు, సాఫ్ట్ రోల్స్ చేసింది. వాటికి భిన్నంగా తనలోని మాస్ యాంగిల్‌ను మా ఇంటి బంగారంతో చూపించింది. సమంతపై వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. వాటి కంపోజింగ్ కూడా స్టైలిష్‌గా ఉంది. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
పంచ్‌లు బాగున్నాయి...
సమంత భర్తగా కన్నడ నటుడు దిగంత్ కనిపించారు. అతడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. విలన్‌గా గుల్షన్ దేవయ్య నటన తేలిపోయింది. కామెడీ పరంగా శ్రీముఖి, మంజూష ఉన్నంతలో నవ్వించారు. సమంత స్నేహితురాలిగా మంజూష వేసే పంచ్‌లు బాగున్నాయి. అత్తింటిని తన గుప్పిట్లో పెట్టుకునే కోడలిగా శ్రీముఖి గుర్తుండిపోయే పాత్ర చేసింది. గవిరెడ్డి శ్రీనివాస్, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, గౌతమి లాంటి యాక్టర్లు సినిమాలో ఉన్నా వారి టాలెంట్‌ను వాడుకోలేదు. యాక్షన్ సినిమాకు తగ్గట్లుగా బీజీఎమ్ ఇచ్చారు సంతోష్ నారాయణన్. రాజ్ నిడిమోరు, వసంత్ మరిగంటి కథ బాగున్నా స్క్రీన్‌ప్లేలో కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తం ఒకే ఇంట్లో సాగుతుంది. లిమిటెడ్ బడ్జెట్‌లోనే సమంత, రాజ్ నిడిమోరు ఈ సినిమాను నిర్మించారు. సమంత ఓన్ డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు.
మా ఇంటి బంగారం పేరులో ఉన్న క్రియేటివిటి సినిమాలో లేదు. సీరియల్‌లా ఓపికకు పరీక్ష పెడుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. ‘ఆయన రియల్ హీరో’ అంటూ ఎమోషనల్ పోస్ట్!
జూన్ 17, 2026

Samantha | మా ఇంటి బంగారంతో నిర్మాతల కష్టమేంటో తెలిసింది – సమంత కామెంట్స్
జూన్ 16, 2026

Sing Geetham Review | సింగ్ గీతం రివ్యూ – మాటల్లేవ్… సినిమా మొత్తం పాటలే – విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ రోల్!
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు
- ●CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి
- ●Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
- ●Rangareddy | రూ.87కోట్లతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
- ●Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం

Harish Rao | రాహుల్ పుట్టిన రోజునే రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టారు: హరీశ్‌రావు

CM Revanth Reddy | విధ్వంసమైన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి

Singareni | Singareni | వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా : సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి

Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ - సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ



